Revanth Reddy on JaggaReddy: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. జగ్గారెడ్డి ఇష్యూ పార్టీ దృష్టికి వచ్చిందని.. సీనియర్ నేతలు ఆయనతో మాట్లాడుతున్నారని తెలిపారు. జగ్గారెడ్డి తమ నాయకుడని.. పార్టీ అధిష్ఠానం అపాయింట్మెంట్ కోరారని చెప్పారు. ఆయనకు తామంతా అండగా ఉంటామని అన్నారు. సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్ట్లు వచ్చాయని కుంగిపోవద్దని సూచించారు.
నాపై కూడా పెట్టారు
తనపై కూడా సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇలాంటి విషయంలో మనోధైర్యంతో బలంగా ఉండాలని అన్నారు. మనం మానసికంగా కృంగిపోతే శత్రువులు మరింత విజృంభిస్తారని చెప్పారు. జగ్గారెడ్డిపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గతంలోనూ వీహెచ్పై కూడా ఇలాగే సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని చెప్పారు. ఆరా తీస్తే కౌశిక్ రెడ్డి అనుచరుడని తేలిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.