Revanth About Police Jobs Age Limit : పోలీసు ఉద్యోగాల భర్తీకి నిర్దేశించిన వయస్సు మరో రెండు సంవత్సరాలు పెంచాలని డిమాండ్ చేస్తూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. కేవలం మూడేళ్లే పెంచడం వల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ నినాదమే...నీళ్లు, నిధులు, నియామకాలని పేర్కొన్న రేవంత్.. తెలంగాణ వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని భావించి ప్రాణాలకు తెగించి ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు.
'కేసీఆర్ సాబ్.. పోలీసు జాబ్స్‌కు వయోపరిమితి పెంచండి' - telangana police jobs
Revanth About Police Jobs Age Limit : పోలీసు ఉద్యోగాల భర్తీకి నిర్దేశించిన గరిష్ఠ వయసును... మరో రెండేళ్లు పెంచాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. కేవలం మూడేళ్లు పెంచితే నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లుగా.. తెరాస ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వనందున ఇప్పుడు చేపట్టే పోలీస్ నియామకాలకు వయో పరిమితి మరో రెండేళ్లు పెంచాలని డిమాండ్ చేశారు.
Revanth About Police Jobs Notification :ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం.. చదువులు పక్కన పెట్టి.. పరీక్షలు బాయ్‌కాట్ చేసి.. విద్యాసంవత్సరం త్యాగం చేసి.. భవిష్యత్‌ను బుగ్గిపాలు చేసుకుని.. నాటి యువత ఆ ఉద్యమంలో భాగస్వామ్యమైందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం మొక్కవోని దీక్షతో పోరాటాలు చేసిన నిరుద్యోగులను.. గద్దెనెక్కిన వెంటనే కేసీఆర్ ప్రభుత్వం మరిచిపోయిందని దుయ్యబట్టారు. నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టి.. వారు ఉద్యోగాల కోసం మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితులను కేసీఆర్ కల్పిస్తున్నారని మండిపడ్డారు.
మరో రెండేళ్లు పెంచాల్సిందే..ఎనిమిదేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి నోటిఫికేషన్లే ఇవ్వనందున.. ఇప్పుడు చేపట్టే పోలీస్ నియామకాలకు వయో పరిమితి మరో రెండేళ్లు పెంచాలని డిమాండ్ చేశారు. వయోపరిమితి పెంచకపోతే 4 లక్షల మంది నష్టపోయే పరిస్థితి ఉందని తెలిపారు. 'నిరుద్యోగులు ఇబ్బందుల్లో ఉంటే... ఓ వైపు హోం మంత్రి పత్తాకు లేరు.. మరోవైపు సీఎం ఫాంహౌజ్‌లో సేద తీరుతున్నారు' అని మండిపడ్డారు. రాష్ట్ర నిరుద్యోగ యువతను పట్టించుకునే నాథుడే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగార్థులు కోరుతున్నట్లు వయో పరిమితి పెంచాలని.. లేని యెడల కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష యుద్ధానికి దిగుతుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.