రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో అధిక సంఖ్యలో సీట్లు సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని 95 మునిసిపాలిటీలకు, 10 నగరపాలక సంస్థలకు పీసీసీ పరిశీలకులను పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి నియమించారు. 5,6 తేదీలలో మునిసిపాలిటీల పరిధిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని ఇంఛార్జిలకు ఉత్తమ్ సూచించారు.
మున్సిపల్ ఎన్నికల పరిశీలకులను నియమించిన ఉత్తమ్
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతోంది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు, నగరపాలక సంస్థలకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ పరిశీలకులను నియమించారు.
మున్సిపల్ ఎన్నికల పరిశీలకులను నియమించిన ఉత్తమ్
నగరపాలక సంస్థల పరిశీలకులు వీరే..
- కరీంనగర్ -ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
- రామగుండం- ఎం.అంజన్, ఆమర్ యాదవ్
- బడంగపేట- వి.హనుమంతురావు
- మీర్‌పేట- కోదండరెడ్డి
- బండ్లగూడ జాగిర్- రాములు నాయక్
- బోడుప్పల్- మాజీ మంత్రి గీతా రెడ్డి
- పీర్జాదిగూడ- మర్రి శశిధర్‌రెడ్డి
- జవహర్‌నగర్- ఎం.ఎ.ఖాన్
- నిజాంపేట- పొన్నాల లక్ష్మయ్య
- నిజామాబాద్- నగరపాలక సంస్థ దామోదర రాజనర్సింహ
ఈ పీసీసీ పరిశీలకులు ఆయా కార్పొరేషన్ల పరిధిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు సూచించారు. వీరితో పాటు జిల్లాల వారీగా పీసీసీ సమన్వయ కర్తలను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియమించారు. ఈ నెల 4వ తేదీన జిల్లా కేంద్రాలలో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాలని వారికి సూచించారు.
TAGGED:
municipal elections 2020