తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్ ​టెన్ న్యూస్ @9pm

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @9pm
టాప్​టెన్ న్యూస్ @9pm

By

Published : Sep 18, 2020, 8:55 PM IST

1. పదోన్నతుల కోసం కమిటీ

రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖలో పదోన్నతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేకంగా డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ- డీపీసీని ఏర్పాటు చేసింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. చూపిస్తే.. కట్టిస్తాం

హైదరాబాద్ నగరంలో ఇళ్లు లేని పేద వారందరికీ రెండు పడక గదులు ఇళ్లు నిర్మించి అందిస్తామని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి అన్నారు. ఇవాళ రెండో రోజు కూడా కాంగ్రెస్ నేతలతో కలిసి మంత్రులు డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించారు... రెండు సైట్​లు పరిశీలించిన అనంతరం కాంగ్రెస్ నేతలు అర్ధాంతరంగా వెళ్లిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. రైతు సమస్యల కోసమే..

రైతు సమస్యల పరిష్కారం కోసమే ప్రగతి భవన్​ ముట్టడికి వెళ్లినట్లు ఎమ్మెల్యే సీతక్క, కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌ రెడ్డిలు తెలిపారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదని వారు ఆరోపించారు. అసెంబ్లీలో చర్చించేందుకు అవకాశం లేకుండా 8రోజులకే వాయిదా వేశారని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. మరో మలుపు..

జమ్ముకశ్మీర్​ షోపియాన్​లో జులై 18న జరిగిన ఎన్​కౌంటర్​పై అనుమానాలు నిజమనేందుకు ప్రాథమిక ఆధారాలు లభించాయని సైన్యం వెల్లడించింది. బాధ్యులపై చర్యలు ప్రారంభించినట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. బిల్లులో ఏముందంటే..?

వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్రం మూడు కీలక బిల్లులకు శ్రీకారం చుట్టింది. ఇందులో రెండు కొత్త బిల్లులు కాగా.. మరొకటి సవరణ బిల్లు. అధికార పక్షం ప్రవేశపెట్టిన ఈ బిల్లులకు.. లోక్​సభలోనూ ఆమోదం లభించింది. అయితే ప్రతిపక్షాలు, అధికార బీజేపీ మిత్ర పక్షాలు ఆ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న శిరోమణి అకాలీ దళ్ ఎంపీ ఏకంగా తన పదవికి రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అసలు ఆ బిల్లుల్లో ఏముంది? ప్రతి పక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? కేంద్రం ఏం చెబుతోంది? అనేది ఓసారి చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. నా మాట వినలేదు

రైతులకు మద్దతుగా వినిపించిన గళాన్ని కేంద్రం పట్టించుకోలేదని శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్​సిమ్రత్ కౌర్ బాదల్ పేర్కొన్నారు. కేంద్ర పదవికి రాజీనామా చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. బిల్లులపై రైతులకు భయాలున్నాయని అన్నారు. రాజీనామా చేయడంలో ఎలాంటి రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 3 కోట్లకు పైగా..

ప్రపంచ దేశాలపై కరోనా పంజా విసురుతూనే ఉంది. రోజుకు లక్షల చొప్పున కొత్త కేసులు వెలుగుచూస్తున్న వేళ.. తాజాగా ఆ సంఖ్య 3 కోట్ల మార్క్​ దాటింది. మొత్తంగా 9.51 లక్షల మంది కరోనాతో మృతి చెందారు. అయితే.. కరోనాను అరికట్టేందుకు ఇజ్రాయెల్​ మరోసారి లాక్​డౌన్​ అస్త్రాన్ని ఎంచుకోగా.. త్వరలో యూకేలోనూ ఈ ఆంక్షలు మరిన్ని ప్రాంతాల్లో అమలు కానున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. మళ్లొచ్చింది..

గూగుల్​ ప్లేస్టోర్​ నుంచి మాయమైన గంటల వ్యవధిలోనే మళ్లీ ప్రత్యక్షమైంది పేటీఎం యాప్​. ఈ మేరకు సంస్థ అధికారిక ప్రకటన చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. చెన్నైXముంబయి

మరికొన్ని గంటల్లో ఐపీఎల్​ ప్రారంభం కానుంది. చెన్నై సూపర్​ కింగ్స్​, ముంబయి ఇండియన్స్​ హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్​ల్లో ఎవరు పైచేయి సాధిస్తూ వచ్చారు? వారి బలాలు, బలహీనతలేంటి? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. నాకు అభిమానులొద్దు..!

అభిమానులపై ఉన్న ప్రేమను తెలియజేసిన నటి రష్మిక.. వారి కుటుంబంలో ఒకరిగా తనను చూడాలని కోరింది. అల్లు అర్జున్ 'పుష్ప' ఈమె హీరోయిన్​గా నటిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details