1. ప్రధాని శుభాకాంక్షలు..
తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సాహిత్యంలో గిడుగు రామ్మూర్తి చెరగని ముద్ర వేశారని కీర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. కొత్త పుస్తకాలు..
ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరంలో సవరించిన సిలబస్‌తో కూడిన కొత్త పుస్తకాలను విడుదల చేశారు. ప్రతీ ఐదేళ్లకోసారి సిలబస్ మార్పులు చేస్తామని.. అందులో భాగంగానే సవరించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. 4 కోట్లకు పైగా..
దేశంలో కరోనా పరీక్షల సంఖ్య 4 కోట్ల మార్కును దాటింది. దేశవ్యాప్తంగా రోజుకు 9 లక్షలకు పైగా నమూనాలు పరీక్షిస్తున్న నేపథ్యంలో ఈ మైలురాయిని అందుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కరోనా పంజా..
దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తమిళనాడులో తాజాగా 6,352 కేసులు నమోదయ్యాయి. యూపీలో 5,684, కర్ణాటకలో 8,324 మంది కరోనా బారినపడ్డట్లు తేలింది. గుజరాత్లో రికార్డు స్థాయిలో కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 24 వేలు దాటింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ప్రపంచం అతలాకుతలం
అంతర్జాతీయంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. అమెరికా, బ్రెజిల్ దేశాల్లో మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. మొత్తం కేసుల సంఖ్య రెండున్నర కోట్లకు చేరువలో ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.