1. మనమే అత్యల్పం
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల రేటు అత్యల్పంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటని పేర్కొంది కేంద్రం. ప్రతి 10 లక్షల మందిలో కేవలం 505 కేసులు, 14.27 మరణాలు ఉన్నట్లు తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో తీసుకుంటున్న చర్యలతోనే ఇది సాధ్యమవుతోందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. అసలేం చేశారు?
కొవిడ్ రోగులకు అందిస్తున్న సేవలు, అధికారులు తీసుకుంటున్న చర్యలపై సీఎస్ సోమేశ్ కుమార్‌తో గవర్నర్ తమిళిసై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై ఆరా తీశారు. సర్కారు తీసుకుంటున్న చర్యలను సీఎస్ గవర్నర్‌కు వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. భాగ్యనగరంలో భయంభయం
జంటనగరాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో నమోదవుతోన్న మొత్తం కేసుల్లో 90 శాతం ఇక్కడే వస్తుండటంతో ప్రభుత్వ యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. ఇవాళ కూడా రాజధానిలో భారీగానే కేసులు నమోదయ్యాయి. కరోనా లక్షణాలతో పాటు అనుమానితులు వేల సంఖ్యలో వైద్య పరీక్షల కోసం బారులు తీరుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఆంధ్ర పెత్తనం కావాలట..!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లయ్యాక కూడా హైదరాబాద్‌పై ఆంధ్రప్రదేశ్ పెత్తనం ఉండాలని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరుకుంటున్నారా అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేయాలన్న ఉత్తమ్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వమే స్వచ్ఛందంగా సచివాలయాన్ని అప్పగించిన తర్వాత సెక్షన్ 8 ప్రశ్నే ఉత్పన్నం కాదని మంత్రి ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. కేంద్రం జోక్యం చేసుకోవాలి
గవర్నర్ పిలిస్తే ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహించడంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వెంటనే గవర్నర్ తన విస్త్రృత అధికారాలను ఉపయోగించి బాధ్యులను విధుల నుంచి తొలగించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై కేంద్రం వెంటనే స్పందించాలని రేవంత్ డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.