తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @7PM - latest news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @7PM
టాప్‌టెన్‌ న్యూస్‌ @7PM

By

Published : Oct 3, 2020, 7:00 PM IST

1. ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా..

ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న పెండింగ్ కేసులపై రోజువారీ విచారణ చేపట్టాలని ప్రత్యేక న్యాయస్థానాలను హైకోర్టు ఆదేశించింది. సీబీఐ, ఏసీబీ, మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులతో పాటు.. ఎమ్మెల్యేలు, ఎంపీలపైనున్న కేసులను విచారిస్తున్న ప్రత్యేక కోర్టులకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ జరపాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. వ్యూహ రచన..

హైదరాబాద్​లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో దుబ్బాక ఉపఎన్నికపై సన్నాహక సమావేశం జరిగింది.ఈ సమావేశంలో అభ్యర్థి ఎంపిక, దుబ్బాకలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలాలు, బలహీనతలు, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం, ప్రచారానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 25మందికి క్లీన్​చీట్

గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసు అధికారులకు క్లీన్‌చిట్‌ వచ్చింది. నయీంకు సహకరించినట్లుగా 25 మంది పోలీసులపై వచ్చిన ఆరోపణలకు సాక్ష్యాధారాలు లభించలేదని సిట్​ పేర్కొంది. సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి రాసిన లేఖకు సమాధానంగా ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్​ ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. సరిగా పనిచేయలే..

గ్యాంగ్​స్టర్​ నయీమ్​ ఎన్​కౌంటర్​ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం 25 మంది పోలీసులకు క్లీన్​చిట్​ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సిట్​ పనితీరుపై సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసులో సిట్​ అధికారుల పనితీరు సరిగా లేదని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. బీఎస్పీకి షాక్..

బిహార్​లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బహుజన్​ సమాజ్​ పార్టీ(బీఎస్పీ)కి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భరత్​ బింద్​.. రాష్ట్రీయ జనతా దళ్​(ఆర్​జేడీ)లో చేరారు. కీలక నేత పార్టీని వీడటం వల్ల ఆర్​ఎల్​ఎస్​పీ నేతృత్వంలోని కూటమిపై ప్రభావం పడనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. ఆ తర్వాతే ఎక్కువైంది..

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్​లో ఉగ్ర సంబంధిత ఘటనలు 9.6 శాతం పెరిగినట్లు గణాంకాల్లో తేలింది. ఈ ఘటనల్లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్య 11.30 శాతం, పౌరుల మరణాలు 1.52 శాతం పెరిగాయి. కాగా.. భద్రతా దళాల మరణాలు ఏకంగా 25.42 శాతం తగ్గుముఖం పట్టాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. పాక్‌కు వ్యతిరేకంగా ముస్లింలు

భారత ముస్లింలు పాకిస్థాన్​పై మండిపడ్డారు. దిల్లీ వీధుల్లో పాక్​కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. పాకిస్థాన్‌లో యాజిద్ పేరిట నినాదాలు చేస్తున్నారంటే ఆ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని అర్థమన్నారు భారత షియా మతాధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. అధ్యక్షుడి కూడా వచ్చింది..!

వైరస్​ను తీవ్రంగా పరిగణించాలనేందుకు డొనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడటం ఓ గట్టి సూచన వంటిదని డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ పేర్కొన్నారు. అందరూ మాస్కు ధరించి, సురక్షిత దూరం పాటించాలని కోరారు. మాస్కు ధరిస్తే వేలాది మంది ప్రాణాలు కాపాడొచ్చని చెప్పారు. ట్రంప్ కోలుకోవాలని ప్రార్థించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. అంత ముఖ్యమా..?

బ్యాటింగ్ ఆర్డర్లో ధోనీ దిగువన రావడంపై క్రికెట్ అభిమానుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమై చెన్నై కోచ్ ఫ్లెమింగ్​ను ప్రశ్నించగా.. అతడు విచిత్రమైన సమాధానం చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. సుశాంత్‌ది సూసైడ్..!

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ రాజ్​పుత్ శవపరీక్షను విశ్లేషించిన ఎయిమ్స్​ ఫోరెన్సిక్​ బృందం.. అతడిది ఆత్మహత్యే అని స్పష్టం చేసింది. అతడికి విషం ఇవ్వడం, గొంతు నులిమి చంపడం వంటివి జరగలేదని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details