1. సీరం సర్వే
జాతీయ పౌష్టికాహార సంస్థ రాష్ట్రంలో మరోసారి సీరం సర్వే చేపట్టింది. జాతీయ పౌష్టికాహార సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. జనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో సీరం సర్వే కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ఏడాది చివరికి ఇళ్లిస్తాం..
హైదరాబాద్ నగరంలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి 85 వేల రెండు పడక గదుల ఇళ్లును.. లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. దేశంలో ఏ నగరంలో లేనంత భారీ ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. చాల చోట్ల పనులు తుది దశకు చేరుకున్నామని మౌలిక వసతులను వేగంగా పూర్తి చేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. సీబీఐ కావాలి
శ్రీశైలం దుర్ఘటనపై జరుగుతున్న సీఐడీ విచారణపై తమకు విశ్వసనీయత లేదని... సీబీఐ విచారణ కోరాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాంగ్రెస్ నేతలు లేఖ రాశారు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ చేయాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రమాదాన్ని చిన్నగా చూపే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. సుప్రీంకు విపక్షాలు..!
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి జరుగనున్న నీట్, జేఈఈపై మరోసారి సుప్రీంకోర్టు గడపతొక్కే యోచనలో విపక్షాలు ఉన్నట్లు సమాచారం. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విపక్ష పార్టీల ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేయగా.. పరీక్షలపై సుప్రీంకోర్టును మరోసారి ఆశ్రయిద్దామని బంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఎన్-95 భేష్
కరోనా వైరస్ వ్యాప్తిని నివారించటంలో ఎన్95 మాస్కులు అత్యంత ప్రభావవంతంగా పనిచేసే అవకాశం ఉందని భారతీయ పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో ఇస్రో శాస్త్రవేత్త కూడా పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.