1. ఉగ్ర కుట్ర
జమ్ము కశ్మీర్‌తోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులకు జైషే మహ్మద్, ఐఎస్ఐ ఉగ్రసంస్థలు కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఆగస్టు 20న సమావేశమై దాడికి పథక రచన చేసినట్లు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. పీవీ విదేశీ విధానంపై చర్చ
గాంధీభవన్‌లో పి.వి.నర్సింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ సమావేశమైంది. ఈ నెల 30న నిర్వహించనున్న పీవీ విదేశీ విధానంపై కమిటీ చర్చించింది. జూమ్ ద్వారా ఈ అంశంపై చర్చ చేపట్టాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. రానున్న రెండు రోజులు
రాష్ట్రంలో ఇవాళ, రేపు చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి ఏర్పడటం వల్ల 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. చంపేశారు..
సంగారెడ్డి జిల్లా గంగారంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోగా.. ఆమెను జిల్లా ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం తీసుకువెళ్లారు కుటుంబసభ్యులు. ఆమె బతికుండగానే మరణించిందంటూ డాక్టర్ సిద్దార్ధ్ చెప్పినట్లు ఆరోపిస్తూ బాధితురాలి కుటుంబీకులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టగా.. వారికి మద్దతుగా సీఐటీయూ నాయకులు ధర్నా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. అధృష్టవంతురాలు..
మహారాష్ట్రలోని భవనం కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 26 గంటల తర్వాత ఓ మహిళ శిథిలాల నుంచి క్షేమంగా బయటపడింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.