1. అదే నా లక్ష్యం
హైదరాబాద్‌ను మురికివాడలు లేని నగరంగా చూడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని.. కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ కట్టెలమండిలో 120 రెండు పడక గదుల ఇళ్లను ఆయన ప్రారంభించారు. కట్టెలమండిలో ఉండే వారంతా కలిసి ఒక సొసైటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. పునః ప్రారంభం
శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి పునరుద్ధరణ జరిగింది. ఒకటి, రెండు యూనిట్లలో ఉత్పత్తిని అధికారులు ప్రారంభించారు. జలవిద్యుత్ కేంద్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పూజలు చేసి స్విచ్ఛాన్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఎదురుచూపులు..
తెలుగు రాష్ట్రాల మధ్య దసరా సందర్భంగా అంతర్రాష్ట్ర సర్వీసులు నడవకపోవడం వల్ల అటు ప్రయాణికులు ఇబ్బందులు పడటంతో పాటు ఆర్టీసీ ఆదాయం కోల్పోయింది. ఏటా టీఎస్ఆర్టీసీ దసరా సందర్భంగా అదనపు బస్సులు నడిపించేది. గతేడాది సమ్మె కారణంగా, ఈ ఏడాది కరోనా నేపథ్యంలో అంతర్రాష్ట్ర సర్వీసుల పునరుద్ధరణ కాకపోవడం వల్ల బస్సులను నడిపించలేది. ఈ మేరకు రూ. 2 కోట్లకు పైగా ఆదాయం కోల్పోయినట్లు ఆర్టీసీ కార్మిక సంఘాలు అంచనావేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. బాలుడు బలి
మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో బాలుడి మృతి కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. షేర్‌చాట్‌లో వీడియో తీసుకునే క్రమంలో బాలుడు ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కిందపడినట్లు పోలీసులు తెలిపారు. బాలుడు ఉంటున్న ఇంట్లోనే అద్దెకు ఉంటున్న బిహార్ వాసి సుదర్శన్ శర్మ బాలుడితో షేర్‌చాట్ వీడియో తీసే క్రమంలోనే ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. జైలు వెంటనే బెయిల్
బొగ్గు బ్లాక్‌ను కేటాయించడంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన కుంభకోణం కేసులో దోషిగా తేలిన కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేకు శిక్ష ఖరారు చేసింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. ఆయనతో పాటు మరో ఇద్దరికి 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కొద్ది సమయానికే లక్ష రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరైనట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.