తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

By

Published : Aug 24, 2020, 3:01 PM IST

topten news @3PM
టాప్​టెన్​ న్యూస్ @3PM

1. రైట్​ రైట్​

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణకు చర్యలు ప్రారంభమయ్యాయి. బస్సులు నడపడంపై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు.. హైదరాబాద్ బస్​భవన్‌లో సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. రాగల రెండు రోజులు

రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణ సంచాలకులు తెలిపారు. ఎల్లుండి సైతం ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. ప్లీజ్​ నన్ను తప్పించండి

కాంగ్రెస్​ పార్టీ సారథ్యంపై సీడబ్ల్యూసీ కీలక భేటీ కొనసాగుతోంది. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతోన్న సోనియా గాంధీ.. తనను ఆ పదవి నుంచి తప్పుకునేందుకు అవకాశం కల్పించాలని కోరినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. రాహుల్​ గుర్రు

కాంగ్రెస్ నాయకత్వ మార్పు విషయమై చర్చించేందుకు సీడబ్ల్యూసీ భేటీ అయింది. 23 మంది సీనియర్లు సోనియా గాంధీకి రాసిన లేఖపై సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. ఈ లేఖపై రాహుల్​ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాగాంధీ అనారోగ్యంతో ఉండగా లేఖ రాయాల్సిన అవసరమేంటని నాయకులను ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. కాంగ్రెస్​లో భాజపా రగడ

కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ సమావేశంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీనియర్​ నేతల లేఖపై రాహుల్​ గాంధీ మండిపడినట్లు వార్తలు వచ్చాయి. ఆ వెనువెంటనే గులాం నబీ ఆజాద్​, కపిల్​ సిబల్​ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే.. అవన్నీ అవాస్తవమని, రాహుల్​ అలా అనలేదని తాజాగా ప్రకటించారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. నడిరోడ్డుపై ఎన్​కౌంటర్​

ఉత్తర్ ప్రదేశ్​లో ఆరుగురు దుండగులు అరెస్ట్ అయ్యారు. అర్ధరాత్రి వేళ మారణాయుధాలు పట్టుకుని రోడ్డుపై తిరుగుతున్న ముఠాను పక్కా సమాచారంతో.. మాటువేసి పట్టుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య రోడ్డుపైనే కాల్పులు జరిగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. ఇంకా కాల్చాలనుకున్నా!

న్యూజిలాండ్​లోని రెండు ప్రార్థనా స్థలాలపై గత ఏడాది జరిగిన దాడి ఘటనపై విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా.. 51 మందిని పొట్టన పెట్టుకున్న నిందితుడు ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా ఇంకా ఎక్కువ మందినే కాల్చాలనుకున్నా అని పేర్కొనటం గమనార్హం. నిందితుడిపై 51 హత్యలు, 40 హత్యాయత్నాలు, తీవ్రవాదం తదితర నేరాలపై విచారణ జరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. మార్కెట్​ జోరు

స్టాక్ మార్కెట్లు మిడ్​ సెషన్​లోనూ లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 250 పాయింట్లకుపైగా వృద్ధితో 38,685 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 70 పాయింట్లకుపైగా బలపడి 11,446 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. మిస్బాకు ఉద్వాసన

పాకిస్థాన్​ జట్టుకు చీఫ్ సెలెక్టర్, హెడ్​ కోచ్​గా ఉన్న మిస్బావుల్​ హక్​ అధిక భారం ఎదుర్కొంటున్నట్లు పీసీబీ భావిస్తోందట. అందుకే అతడిని చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తప్పించాలని చూస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. క్లారిటీ

మొన్నటి వరకు సినిమాలకు సీక్వెల్స్‌ వచ్చేవి. ఇప్పుడు ఆ హవా వెబ్‌ సీరిసుల్లోకి వచ్చేసింది. అమెజాన్​ ప్రైమ్​లో ఎక్కువ ప్రజాదరణ పొందిన 'మీర్జాపూర్​' వెబ్​సిరీస్​.. రెండో సీజన్​తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ సీక్వెల్​ విడుదలపై అమెజాన్​ప్రైమ్​ తాజాగా స్పష్టత ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details