1. కాల'నీళ్లు'
హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. పాతబస్తీ శివారులోని గుర్రం చెరువు కట్ట తెగింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఉప్పగూడ, సాయిబాబా నగర్, శివాజీనగర్, బాబా నగర్ బస్తీలను వరద ముంచెత్తింది. వర్షంతో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. గుర్రాలపై సహాయక చర్యలు
చూడగానే ఇదేంటి వీళ్లు నీళ్లలో గుర్రాల మీద స్వారీ చేస్తున్నారు అనుకుంటున్నారా! గుర్రాల రేసు కోర్టులో ఉండాల్సిన రైడర్లు కాలనీల్లో తిరుగుతున్నారేంటి అనుకుంటున్నారా! అవును ఇది నిజమే కానీ వారంతా స్వారీ చేయట్లేదు. హైదరాబాద్ వరదల్లో చిక్కుకున్న ప్రజలకు నిత్యావసరాలను అందిస్తున్నారు. టోలిచౌకిలోని వివిధ కాలనీల్లో ప్రజలు బయటికి రాలేని పరిస్థితుల్లో వినూత్న పద్ధతిలో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. కబ్జా చేసినా పట్టించుకోవా..?
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ రంగానాయకుల గుట్టకాలనీలో నాలా భూమిలన్నీ కబ్జాలకు గురవుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఎందుకు పటించుకోలేదని కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డిని నిలదీశారు. కాలనీ వరదలో మునిగిపోతుందంటూ కార్పొరేటర్‌పై దాడి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. అర్ధరాత్రి హత్య..
అర్ధరాత్రి రాధిక అనే యువతిని గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన పాతబస్తీలో చోటు చేసుకుంది. పోలీసులు క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. కరోనా తగ్గుతోంది..!
భారత్‌లో కొవిడ్-19 పాజిటివ్ కేసుల రేటు తగ్గుతుంది. రోజువారీ పరీక్షల్లో పాజిటివ్ కేసులు 8 శాతానికి దిగువనే నమోదవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.