1. నన్ను చంపాలి
హైదరాబాద్ గచ్చిబౌలికి చెందిన హేమంత్ పరువు హత్యపై అతని భార్య అవంతి స్పందించారు. తన బావలు, వదినలు, మామయ్యలే హేమంత్‌ను హత్య చేయించారని ఆరోపించారు. నాన్నకు పెళ్లి ఇష్టం లేకుంటే తనను చంపాలని కాని హేమంత్‌ను చంపడం దారుణమన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. వేరే కులమనే..
హేమంత్ పరువు హత్యపై అతని తల్లి కన్నీరుమున్నీరయ్యారు. వేర్వేరు కులాల వల్లే హేమంత్‌ని చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కొడుకును సందీప్ రెడ్డి, రాకేశ్ రెడ్డి, రంజిత్ రెడ్డి, యుగేందర్ రెడ్డి, విజయేందర్ రెడ్డే హత్య చేయించారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. గజ్వేల్ ఆసుపత్రికి అవార్డు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆస్పత్రికి కాయకల్ప అవార్డు వరించినట్లు సూపరింటెండెంట్ మహేశ్ తెలిపారు. 2019-20 సంవత్సరానికి గాను పురస్కారం వచ్చినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. మూడో దశ..
కరోనాకు దేశీయంగా తొలి వ్యాక్సిన్ తయారు చేస్తోన్న ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్.. కొవాగ్జిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్‌ను ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలో ప్రారంభించనుంది. అక్టోబర్‌లో ఈ క్లినికల్ ట్రయల్స్ మొదలుకానున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. రైతుల కోసమే..
దేశంలో రైతుల సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయ రంగంలో సంస్కరణలు తెచ్చామని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. గత ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించాయని.. కానీ, ఎన్డీఏ ప్రభుత్వం అన్నిరంగాల్లో స్థిరంగా సంస్కరణలు తీసుకొస్తోందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.