తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @1pm

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @1pm
టాప్​టెన్​ న్యూస్​ @1PM

By

Published : Sep 23, 2020, 12:56 PM IST

1. సీఎస్​ సమీక్ష..

దృశ్యమాధ్యమం ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్ కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీపీవోలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ధరణి సన్నద్ధతను సమీక్షించటంతో పాటు అనుమతులు లేని ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్దీకరణ సంబంధిత అంశాలపై సమీక్షిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. భారత్​ బయోటెక్ ఒప్పందం

వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్​తో భారత్ బయోటెక్ లైసెన్సింగ్ ఒప్పందం చేసుకుంది. నాజల్ స్ప్రే వ్యాక్సిన్ సరఫరాకు ఒప్పందం చేసుకున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. రాష్ట్రపతి వద్దకు విపక్షాలు

వ్యవసాయ బిల్లుల గురించి మాట్లాడేందుకు విపక్షాలు ఈరోజు సాయంత్రం 5 గంటలకు రామ్​నాథ్​ కోవింద్​కు కలవచ్చని రాష్ట్రపతి భవన్ తెలిపినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. కొవిడ్ నిబంధనల దృష్ట్యా ఐదుగురిని మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. విదేశీ విరాళాలకు ఓకే..

మరో కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. ఇప్పటికే లోక్​సభలో నెగ్గిన విదేశీ విరాళాల చట్ట సవరణ బిల్లుకు.. తాజాగా రాజ్యసభ అంగీకారం తెలిపింది. స్వచ్ఛంద సంస్థల రిజిస్ట్రేషన్​ ససయంలో నిర్వాహకులు ఆధార్​ వివరాలు తప్పనిసరిగా తెలియజేయాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. పోటీ చేసేందుకే రాజీనామా!

బిహార్​ డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ పోలీస్​(డీజీపీ) గుప్తేశ్వర్​ పాండే.. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ ప్రకటించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోటీ చేసేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. డిస్​లైక్స్​ ఎక్కువ

యువ నటి అనన్య పాండే కొత్త సినిమా ట్రైలర్​కు విపరీతంగా డిస్​లైక్స్ కొడుతున్నారు నెటిజన్లు. ఇటీవలే ఆలియా 'సడక్ 2' చిత్రంపై ఇలానే విరుచుకుపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. కరోనా అందమైనది..

కొవిడ్​-19ను కరోనా వైరస్​ అని పిలవకూడదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులకు సూచించారు. కరోనా అంటే ఇటలీలో ఓ అందమైన ప్రదేశం పేరు అని.. అందుకే కొవిడ్​ను చైనా వైరస్​గా సంభోదించాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఆనందం ఎక్కువై..

కోల్​కతా జట్టులో చోటు దక్కించుకున్న అలీఖాన్.. ఐపీఎల్​లో ఆడుతున్న తొలి అమెరికా క్రికెటర్​గా రికార్డు సృష్టించాడు. తనకు లీగ్​లో అవకాశం వచ్చిందని తెలియగానే ఉద్వేగంతో ఏడ్చేశాడట. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఇవ్వాల్సింది అతడికి..

చెన్నైై సూపర్​కింగ్స్​పై విజయంలో కీలక పాత్ర పోషించిన బౌలర్ రాహుల్​కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చుండాల్సిందని అభిప్రాయపడ్డాడు రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు సంజూ శాంసన్. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. రానున్న ఏడాది

27వ పుట్టినరోజు జరుపుకొన్న నటి షాలినీ పాండే.. రానున్న సంవత్సరం తన జీవితం అద్భుతంగా ఉండనుందని జోస్యం చెప్పింది. అందుకు గల కారణాల్ని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details