తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @11am

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news@11am
టాప్​టెన్ న్యూస్ @11am

By

Published : Oct 18, 2020, 11:01 AM IST

1. మరో 1,436 కేసులు

రాష్ట్రంలో కొత్తగా 1,436 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,22,111కు చేరింది. వైరస్​తో కొత్తగా ఆరుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1,271కి పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. కృష్ణమ్మ పరవళ్లు..

నాగార్జునసాగర్​ ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం 18 క్రస్టు గేట్లు 20 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. పట్టుదలతో నిలిచారు..

వ్యాపారవేత్తలు కావాలని కలలు కనలేదు.. సేవలు చేసి పేరు తెచ్చుకోవాలనీ అనుకోలేదు. పరిస్థితులే వీరిలో పట్టుదలను పెంచాయి. నలుగురిలో ఆదర్శంగా నిలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. దేశంలో కరోనా..

దేశంలో కొత్తగా 61వేల 871 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,033 మంది వైరస్ ధాటికి బలయ్యారు. మొత్తం మరణాల సంఖ్య 1,14,031కి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. అంగుళం కూడా ఆక్రమించుకోలేరు..

భారత్​- చైనా సరిహద్దు వివాదంపై కేంద్రమంత్రి అమిత్​ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఒక్క అంగుళం కూడా ఎవరూ ఆక్రమించుకోలేరని తేల్చిచెప్పారు. ప్రధాని మోదీ ప్రభుత్వం నిత్యం అప్రమత్తంగా ఉండి దేశ సార్వభౌమాధికారం, సరిహద్దును రక్షిస్తోందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. కొత్త ఒప్పందం

రష్యా మధ్యవర్తిత్వంతో ఆర్మేనియా, అజర్​బైజాన్​ల మధ్య ఉద్రిక్తతలు తగ్గినట్లు కనిపిస్తున్నాయి. వివాదాస్పద నాగోర్నో-కరాబఖ్​ ప్రాంతంపై ఆధిపత్యం కోసం.. కొన్నిరోజులుగా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి ఈ దేశాలు. తాజాగా ఈ ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. పేటీఎం వడ్డన..

వినియోగదారులకు పేటీఎం సంస్థ షాకిచ్చింది. క్రెడిట్‌కార్డు ద్వారా వ్యాలెట్‌కు నగదు బదిలీ చేసుకుంటే 2% రుసుము వసూలు చేయనుంది. బ్యాంకులు అధిక ఛార్జీలు వడ్డిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. డివిలియర్స్ వద్దు..!

తమకు అవకాశమొచ్చినా సరే మ్యాచ్​లో, డివిలియర్స్​కు బౌలింగ్ చేయాలనుకోవట్లేదని ఆర్సీబీ ఆటగాళ్లు మోరిస్, చాహల్ చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. వార్నర్ బిడ్డ కోహ్లీ ఫ్యాన్

నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న ఐపీఎల్‌ పోరులో సంచలనాలు సృష్టిస్తున్నాడు హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ జట్టు సారథి డేవిడ్‌ వార్నర్‌. ఈ లీగ్‌లో విధ్వంసక బ్యాట్స్‌మన్‌గా 50 సార్లు 50కిపైగా పరుగులు చేసిన ఒకే ఒక్క ఆటగాడిగా నిలిచాడు. బ్యాటింగ్‌ బాదుడుతో దూసుకుపోతున్న వార్నర్‌ గురించి మరిన్ని విషయాలు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. ఇద్దరు ముద్దుగుమ్మలతో 'ఖిలాడి' రవితేజ

'క్రాక్'లో నటిస్తున్న హీరో రవితేజ.. తన కొత్త సినిమాకు 'ఖిలాడి' పేరు పెట్టారు. ఇందులో ఇద్దరు ముద్దుగుమ్మలు నటించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details