ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు'రెండో డోసు, బూస్టరు డోస్ మధ్య గడువు తగ్గించండి' రెండో, బూస్టర్ డోసు మధ్య గడువు తగ్గించాలని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయను మంత్రి హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రికి హరీశ్‌రావు లేఖ రాశారు.20 మంది పోలీసులకు కరోనా రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. పోలీస్ శాఖను కూడా వైరస్ వదలట్లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో 20 మంది పోలీసులకు కరోనా సోకింది. ప్రస్తుతం అందరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.గణతంత్ర వేడుకలపై ఉగ్ర కుట్ర! ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా ఇతర ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని గణతంత్ర దినోత్సవం నాడు భారీ ఉగ్రదాడులకు కుట్రలు జరుగుతున్నాయని నిఘా సంస్థల సమాచారం. ప్రజా సమూహాలు, రద్దీ ప్రదేశాలను, కీలక కట్టడాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరగొచ్చని తెలుస్తోంది.రేపే ఎన్‌డబ్ల్యూడీఏ భేటీ.. గోదారి-కావేరి లింకుపై ప్రధానంగా చర్చించేందుకు జాతీయ జల అభివృద్ధి సంస్థ ఈనెల 19వ తేదీన సమావేశం కానుంది. కేంద్రజల్‌శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ భేటీలో.. వివిధ రాష్ట్రాలు పాల్గొననున్నాయి. 4 కీలక ప్రాజెక్టుల గురించి సమావేశంలో చర్చించనున్నారు.పంజాబ్ ఆప్ 'సీఎం' అభ్యర్థి ఎవరంటే? పంజాబ్ ఎంపీ భగవంత్ మాన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఖరారు చేశారు.ఆ సీఎం బంధువు ఇంట్లో ఈడీ సోదాలు! అక్రమ ఇసుక మైనింగ్ వ్యవహారంలో పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ సమీప బంధువు భూపిందర్ సింగ్‌కు చెందిన ఇళ్లపై ఈడీ దాడులు జరిపింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ దాడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.టిప్పర్ బీభత్సం.. బాట సింగారం వద్ద మంగళవారం తెల్లవారుజామున టిప్పర్ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అదుపుతప్పి.. ఆర్టీసీ బస్సు, కారును ఢీకొంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి గాయాలయ్యాయి.జోరుగా హిమపాతం అమెరికా తూర్పు తీరాన్ని హిమపాతం వణికిస్తోంది. న్యూయార్క్, ఓహియో, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో అడుగుల మేర మంచుదుప్పటి పరుచుకుంది. ఎక్కడ చూసినా మంచు మాత్రమే కనిపిస్తోంది. 'దేశం కోసం ఆడుతున్నప్పుడు ఆ ఫైర్ ఉండటం సహజమే' దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భాగంగా రెండో టెస్టులో టీమ్ఇండియా బౌలర్ బుమ్రాతో జరిగిన గొడవపై స్పందించాడు సౌతాఫ్రికా బౌలర్ జాన్సన్. దేశం కోసం ఆడుతున్నప్పుడు అవి సహజమే అని చెప్పాడు.ఈ వారం థియేటర్, ఓటీటీ సినిమాలు ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించేందుకు మరికొన్ని సినిమాలు సిద్ధమవుతున్నాయి. అలాగే ఇప్పటికే రిలీజ్ అయిన చిత్రాలు ఓటీటీల్లో వచ్చి సందడి చేయనున్నాయి. అవి ఏంటో ఓ సారి చూద్దాం.