తెలంగాణ

telangana

ETV Bharat / city

TOP TEN NEWS TODAY : టాప్​టెన్​ న్యూస్​ @7AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధానవార్తలు

TOP TEN NEWS TODAY, telangana news
టాప్​టెన్​ న్యూస్

By

Published : Feb 11, 2022, 6:59 AM IST

  • నేడు జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన

జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం సహా తెరాస కార్యాలయాన్ని సీఎం ఇవాళ ప్రారభించనున్నారు. ఇప్పటికే పట్టణమంతా గులాబీమయం కాగా... కేసీఆర్‌ సభ కోసం తెరాస నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం రాకతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • మద్యంతో ఆ అవయవాలకూ క్యాన్సర్‌.. !

ప్రపంచవ్యాప్తంగా మద్యం కారణంగా ఏటా 30 లక్షల మరణాలు సంభవిస్తున్నట్లు ‘ఆక్స్‌ఫర్డ్‌ పాపులేషన్‌ హెల్త్‌’ అధ్యయనం తెలిపింది. ఇందులో 4 లక్షలు క్యాన్సర్‌ కారణంగా జరుగుతున్నట్లు స్పష్టం చేసింది. మద్యపానంతో కాలేయమే కాదు.. నోరు, పెదవులు, స్వరపేటిక, అన్నవాహిక, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్ల బారినపడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది.

  • స్థలం కొనుక్కున్న వారికి చుక్కలు

కొందరు స్థిరాస్తి వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నారు. లక్షలు చెల్లించి కొన్న ప్లాట్​కు.. ఇల్లు కట్టుకునేవరకు పూచీకత్తు లేకపోవడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను విశ్లేషించిన అధికారి ఒకరు.. వచ్చిన దరఖాస్తుల్లో సగం కూడా నిబంధనల మేరకు లేవనడం గమనార్హం.

  • మేడారం జాతర ప్రత్యేకతను తెలిపేలా ఆహ్వన పత్రిక

తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర ఆహ్వాన పత్రికను గిరిజన సంక్షేమ శాఖ.. గిరిజన కళలు, హస్తకళలు ప్రతిబింబించే విధంగా ప్రత్యేకంగా తయారు చేసింది. 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగే జాతర రోజు వారీ కార్యక్రమాల వివరాలన్నీ దీనిలో ఉంటాయి.

  • 'భాజపా ఆఫీస్​పై పెట్రోల్ బాంబు దాడి కేసులో భారీ కుట్ర'

తమిళనాడులో భాజపా ప్రధాన కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తి పెట్రోల్ బాంబు విసిరిన ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) విచారణ జరపాలని భాజపా డిమాండ్ చేసింది. ఈ కేసులో భారీ కుట్ర దాగి ఉందని రాష్ట్ర భాజపా చీఫ్​ అన్నామలై అనుమానం వ్యక్తం చేశారు.

  • ఆ రాష్ట్ర ఎన్నికల్లో రూ.404 కోట్ల విలువైన మద్యం స్వాధీనం!

పంజాబ్​లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేసిన నాటి నుంచి రూ.404.01కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.

  • ''యూపీ కేరళలా మారితే..' యోగి భయమంతా అందుకే..!'

సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌ కేరళలా మారిపోతే ప్రజలకు మంచి విద్య, నాణ్యమైన వైద్య సేవలు, సామాజిక సంక్షేమం, మంచి జీవన ప్రమాణాలు, మతాలు, కులాల పేరిట హత్యల్లేని ఓ సామరస్య సమాజం ఏర్పడుతుందనే యోగి ఆదిత్యనాథ్‌ భయపడుతున్నారంటూ చురకలంటించారు.

  • 'కరోనా నాలుగో డోసూ వేయాల్సి రావొచ్చు'!

ఒమిక్రాన్‌పై పోరాటంలో భాగంగా అమెరికాలో పౌరులకు నాలుగో డోసూ వేయాల్సిన అవసరం రావొచ్చని అభిప్రాయపడ్డారు ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, దేశాధ్యక్షుడి ప్రధాన వైద్య సలహాదారు ఆంటోని ఫౌచీ.

  • 'సీఎస్కేకు ధోనీ కెప్టెన్సే కాదు అది కూడా ముఖ్యమే'

చెన్నై సూపర్‌ కింగ్స్ జట్టుకు ధోని కెప్టెన్సీ ఎంత ముఖ్యమో, అతడిలోని ఫినిషింగ్‌ ప్రతిభ కూడా అంతే ముఖ్యమని చెప్పాడు టీమ్​ఇండియా సీనియర్​ స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే ఆటగాళ్లలో చాలా తక్కువ మంది మాత్రమే మహిలా బ్యాటింగ్ చేయగలరని పేర్కొన్నాడు.

  • ''ఖిలాడి'.. విందు భోజనం లాంటి సినిమా'

హీరో రవితేజది చిన్నపిల్లాడి మనస్తత్వమని డైరెక్టర్ రమేష్ వర్మ చెప్పారు. ఈ సినిమా హిట్​ కొడితే మరో ఛాన్స్ ఇస్తారని చెప్పుకొచ్చాడు.

ABOUT THE AUTHOR

...view details