- దూరం పాటిస్తూ.. ఓటు వేస్తూ..
బంగాల్, అసోంలో.. తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు బార్లు కడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- పాతబస్తీలో అగ్నిప్రమాదం..
హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్‌పురలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగు గోదాంలలో మంటలు చెలరేగి ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఒకదాని పక్కన ఒకటి ఉన్న వాహన విడిభాగాలు, బొగ్గు, మరో 2 గోదాముల్లో మంటలు చెలరేగాయి. ఘటనా సమయంలో గోదాముల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
రాష్ట్రంలో ఎట్టిపరిస్థితుల్లో లాక్‌డౌన్ ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో స్పష్టం చేశారు. కరోనా నియంత్రణలో దేశంలోనే మంచి ఫలితాలు సాధించామని తెలిపారు. పంచాయతీరాజ్ కార్యదర్శులకు రెగ్యులర్ వేతనం ఇస్తామని ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలూ పెంచుతామని హామీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
కరోనా.. మనిషిని శారీరకంగానే కాదు.. మానసికంగానూ కుంగదీస్తోంది. కొవిడ్ విజృంభించిన సమయంలో మానసిక సమస్యలతో సతమతమయ్యే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఇంతకుమునుపెన్నడూ లేని పరిస్థితులకు అలవాటు పడే తరుణంలో చాలామంది తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఈ పరిస్థితుల్లో ఒత్తిడి తగ్గించుకుని మానసిక ఆరోగ్యం కాపాడుకోవడం ఎలా అన్నది అందరి ముందు ఉన్న అతి పెద్ద ప్రశ్న. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
తన యజమాని చెప్పిన మాట వినటమే ఆ కూలీకి మరణ శాసనమైంది. యజమానికి... మరో వ్యక్తికి మధ్య జరిగిన గొడవలో... సంబంధమే లేని ఓ అమాయకపు కూలీ బలయ్యాడు. ఆ గొడవ కూడా కేవలం 720 రూపాయల విషయంలో కావటం దారుణమైన విషయం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ధైర్య సాహసాలతో అటవీ మాఫియా ఆటలు కట్టించిన మహారాష్ట్ర 'లేడీ సింగమ్' దీపాలీ చవాన్ ఆత్మహత్య చేసుకున్నారు. ఐఎఫ్‌ఎస్ అధికారి ఒకరు తనను లైంగికంగా తీవ్ర వేధింపులకు గురిచేశాడని, ఆయన చేతిలో తాను చిత్రహింసలకు గురయ్యానంటూ ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన నాలుగు పేజీల లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- పేద దేశాలకు కొవిడ్ టీకాలు?
వీలైనంత త్వరగా పేద దేశాలకు కోటి కొవిడ్ 19 వ్యాక్సిన్ డోసులను అందించాలని ధనిక దేశాలను కోరింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. టీకా సరఫరా సమస్యల కారణంగా ఇప్పటికీ 20 దేశాలకు తొలి టీకా తీసుకునే భాగ్యం దక్కలేదని చెప్పింది. ప్రైవేట్ ఒప్పందాల కారణంగా పేద దేశాలకు టీకాలు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- డ్రైవింగ్ లైసెన్స్‌ల గడువు పొడిగింపు
ఫిట్‌నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇతర రవాణా సంబంధిత డాక్యుమెంట్ల పునరుద్ధరణ గడువును మరోసారి పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా సమయానికి పొందలేకపోయిన పత్రాలు జూన్ 30 వరకు చెల్లుబాటు అవుతాయని ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- అడవిని దాటి.. కొండను ఎక్కి!
భారత్‌లో క్రికెట్ అభిమానులకు సుపరిచితమైన పేరు సుధీర్ కుమార్. టీమ్ఇండియా ఆడే ప్రతి మ్యాచ్‌కూ హాజరై స్టాండ్స్‌లో అతడు చేసే సందడి అందరికీ తెలిసిందే. తాజాగా కరోనా పరిస్థితుల వల్ల భారత్-ఇంగ్లాండ్ మధ్య పుణె వేదికగా జరుగుతోన్న వన్డే సిరీస్‌కు ప్రేక్షకుల్ని అనుమతించలేదు. దీంతో సుధీర్‌కు మ్యాచ్ చూసే అవకాశం లేకపోయింది. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గకుంగా మైదానం దగ్గర్లోని ఓ కొండపై నుంచి మ్యాచ్‌ను వీక్షిస్తున్నాడీ సూపర్ ఫ్యాన్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఎన్టీఆర్‌తో సినిమా చేస్తా
'తెల్లవారితే గురువారం' సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్న మణికాంత్.. చిత్రవిశేషాలను పంచుకున్నారు. ఎన్టీఆర్ 'ఆది' చూసిన తర్వాత డైరెక్టర్ అవ్వాలనుకున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి