తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @11AM

ఇప్పటివరకు ప్రధానవార్తలు

top ten news
టాప్​టెన్​ న్యూస్

By

Published : Feb 5, 2022, 11:02 AM IST

  • దేశంలో భారీగా తగ్గిన కొవిడ్​ కేసులు

COVID CASES IN INDIA: భారత్​లో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు మరో 1,27,952 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 1,059 మంది మరణించారు. దేశంలో పాజిటివిటీ రేటు 7.98 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • ప్రధాని రాక దృష్ట్యా క్రతువుల్లో స్వల్ప మార్పు..

Statue of Equality Inauguration: ముచ్చింతల్‌లో నాలుగోరోజు రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. వసంత పంచమి సందర్భంగా యాగశాలలో విష్వక్సేనేష్ఠి యాగం నిర్వహిస్తున్నారు. నేడు రామానుజాచార్యుల పంచలోహ విగ్రహాన్ని దేశ ప్రధాని నరేంద్రమోదీ లోకార్పణం చేయనున్నా నేపథ్యంలో పలు క్రతువుల్లో స్వల్ప మార్పులు చేశారు.

  • సరస్వతి ఆలయాలు కిటకిట.. క్యూలైన్యలో భక్తుల కటకట

Vasantha Panchami: వసంత పంచమిని పురస్కరించుకుని సరస్వతి అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిలాడుతున్నాయి. అమ్మవారి సన్నిధిలో చిన్నారుల అక్షరాభ్యాసాలు, ప్రత్యేక పూజలతో.. నిర్మల్​ జిల్లాలోని బాసర, సిద్దిపేట జిల్లాలోని వర్గల్​ దేవాలయాలు కోలాహలంగా మారాయి.

  • రెండో రోజూ అంధకారంలో ఏపీ.. కారణం అదేనట!

Power Cut Problems in AP : ఎన్టీపీసీకి ఏపీ డిస్కంలు బకాయిపడ్డ మొత్తం విషయంలో స్పందించకపోవడం వల్లే అక్కడి నుంచి సరఫరా నిలిచిపోయి ఆ రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు మొదలయ్యాయి. ఎన్టీపీసీకి డిస్కంలు రూ.350 కోట్ల బకాయి పడ్డాయి. వీటికోసం ఎన్టీపీసీ వర్గాలు రెండు నెలలుగా డిస్కంలకు లేఖలు రాస్తున్నాయి.

  • కశ్మీర్​, నోయిడాలో భూప్రకంపనలు

Kashmir Earthquake: కశ్మీర్​, నోయిడా సహా ఇతర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • అడవితల్లి రక్షణలో గుజరాత్‌ మహిళలు.. అన్నీ వారై..!

Woman forestgourds in surat mandvi: సువిశాలమైన అడవికి ఏడుగురు మహిళలే రక్షణగా నిలుస్తున్నారు. క్రూరమృగాలకు ఏమాత్రం బెదరకుండా మనోధైర్యంతో ముందుకుసాగుతున్నారు. ధైర్యమే ఆయుధంగా మొక్కవోని కార్యదీక్షతో విధులు నిర్వహిస్తున్నారు. రాత్రింభవళ్లు కంటిమీద కునుకు లేకుండా అడవితల్లి రక్షణలో నిమగ్నమయ్యారు.

  • కుప్పకూలిన విమానం- ఏడుగురు మృతి

Plane Crash: పెరూలో తేలికపాటి విమానం కూలి ఏడుగురు మృతి చెందారు. పెరువియన్​ ఎడారిలోని నాజ్కా లైన్ల పర్యటన కోసం సందర్శకులను తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. నాజ్కాలోని వైమానికి కేంద్రానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు.

  • ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే?

Gold Price Today: దేశంలో పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 49వేల పైకి చేరింది. కిలో వెండి ధర రూ. 62 వేల వద్ద ఉంది. ఇంధన ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల బంగారం ధర ఇలా ఉంది.

  • ఆసీస్​ హెడ్​ కోచ్​ జస్టిన్​ లాంగర్​ రాజీనామా

Australia Head coach Justin Langer resign: ఆస్ట్రేలియా క్రికెట్​ జట్టుకు కోచ్​గా కొనసాగాలని ఆశించిన జస్టిన్​ లాంగర్​ కల నెరవేరలేదు. అతడు తన పదవికి రాజీనామా చేశాడు.

  • కమెడియన్ రాహుల్ రామకృష్ణ​ సంచలన నిర్ణయం

Rahul Ramakrishna: ప్రముఖ కమెడియన్​ రాహుల్​ రామకృష్ణ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. నటనకు దూరం కానున్నట్లు ప్రకటించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు.

ABOUT THE AUTHOR

...view details