3,527 కొత్త కేసులు..
రాష్ట్రంలో.. గడిచిన 24 గంటల వ్యవధిలో 3,527 మంది కరోనా సోకినట్లు (corona positive) నిర్ధారణ అయింది. కొత్తగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,982 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
బిర్యానీపై KTRకు ఫిర్యాదు
ఆన్లైన్లో బిర్యానీ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తి... తనకొచ్చిన పార్శిల్లో లెగ్‌పీసులు (leg piece) లేవంటూ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. దీనిపై మంత్రి స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రేపే చివరి నివేదిక
ఆనందయ్య ఔషధ పరీక్షలపై రేపు చివరి నివేదిక వస్తుందని ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు వెల్లడించారు. దీనిపై హైకోర్టులో సోమవారం విచారణ జరగనుందన్నారు. కంటి మందుపై ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం జగన్ (CM Jagan) ఆదేశించారని రాములు వివరించారు. ఔషధంపై ఆనందయ్య దరఖాస్తు చేసుకోవాలంటూ వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
పదేళ్ల పాటు పొడిగింపు
రాష్ట్రంలో బలహీనవర్గాల రిజర్వేషన్లను మరో పదేళ్ల పాటు పొడిగించారు. విద్య, ఉద్యోగ నియామకాల్లో బీసీ రిజర్వేషన్లను పొడిగించారు. ఏ కేటగిరీలో ఏడు శాతం, బీ కేటగిరీ వారికి పదిశాతం, సీ కేటగిరీలో ఒక శాతం, డీ కేటగిరీలో ఏడు, ఈ కేటగిరీలో నాలుగు శాతం బీసీ రిజర్వేషన్లు అమలవుతాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
లైసెన్సు రద్దు
మంత్రి కేటీఆర్ (KTR) సూచనతో.. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రిపై ఆరోగ్య శాఖ కొరడా ఝులిపించింది. కొవిడ్ చికిత్సల లైసెన్సును రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. నల్గొండకు చెందిన వంశీకృష్ణ ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే మరణించారనే ఫిర్యాదుపై స్పందించిన ఆరోగ్య శాఖ 24 గంటల్లోనే చర్యలు చేపట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.