ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @3PM - latest news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు...

top ten news till now
top ten news till now
author img

By

Published : Apr 29, 2021, 2:59 PM IST

1. రాష్ట్రానికి టీకాలు వచ్చేశాయి...

రాష్ట్రానికి 3 లక్షల కొవిషీల్డ్ టీకాలు వచ్చాయి. వీటిని కోఠిలోని రాష్ట్ర టీకా నిల్వకేంద్రంలో నిల్వచేయనున్నారు. అక్కడ నుంచి అవసరం ఉన్న ప్రాంతాలకు టీకాలను పంపించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. తాజాగా టీకాల కొరత ఏర్పడినా... నేడు 3 లక్షల కొవిషీల్డ్ టీకాలు రాష్ట్రానికి వచ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. నార్కొటిక్స్​ బ్యూరో ఏం చేస్తోంది...

2016వ సంవత్సరంలో రాష్ట్రంలో కలకలం రేపిన డ్రగ్స్‌ కేసు దర్యాప్తును... కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. నాలుగు వారాల్లో కౌంటర్ వేయాలని కేంద్రం సహా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. బంగాల్​లో సాగుతోన్న పోలింగ్​...

బంగాల్​ ఎనిమిదో విడత ఎన్నికల్లో ఒంటి గంట వరకు 56.19 శాతం ఓట్లు పోలైయ్యాయని అధికారులు వెల్లడించారు. ఎన్నికల్లో రాష్ట్ర గవర్నర్​ జగ్​దీప్ ధన్​కర్.. ఆయన సతీమణి సుదేశ్​ ధన్​కర్​ ఓటు వేశారు. కోల్​కతాలోని చోరంగీ పోలింగ్​ బూత్​లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. ఉచితంపై రాహుల్​ ట్వీట్​...

దేశప్రజలందరికీ టీకా ఉచితంగా ఇవ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉచితం అర్థాన్ని చెబుతూ ఓ ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. ఎన్​కౌంటర్​లో కీలక ఉగ్రవాది హతం...

అసోంలో ఉల్ఫా ఉగ్రసంస్థకు చెందిన కీలకనేతను భద్రతా సిబ్బంది హతమార్చారు. అతని అనుచరుడిని అరెస్ట్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.


6. ఒకే గదిలో 100 మంది కరోనా రోగులు...

ఓ వైపు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న చాప కింద నీరులా కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. మరోపక్క కరోనా నిబంధనలను ఉల్లంఘించే వారిని అధికారులు చూసీ చూడనట్లు వదిలేయడం పలు విమర్శలకు తావిస్తోంది. జమ్ముకశ్మీర్​లో వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీల్లో చాలామందికి కరోనా సోకింది. 100 మందికి పైగా రోగులను ఒకే గదిలో క్వారంటైన్ చేశారు అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 80కి పైగా దేశాలకు మన టీకాలు...

వ్యాక్సిన్‌ మైత్రి ద్వారా 80కి పైగా దేశాలతో టీకాలను పంచుకున్నట్లు ఐరాసకు భారత్ తెలిపింది. ఇప్పటివరకు 6.6 కోట్లకు పైగా డోసులను ప్రపంచ దేశాలకు అందించినట్లు వెల్లడించింది. 150కి పైగా దేశాలకు ఔషధాలను సరఫరా చేసినట్లు వివరించింది. మరోవైపు, భారత్​కు తమ విభాగాలు సాయం అందిస్తున్నాయని ఐరాస పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. అంతలా డీలా... భారత్​లో ఇలా...

భారత్​లో పసిడి డిమాండ్ ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 37 శాతం పెరిగి.. 140 టన్నులకు చేరినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదికలో తేలింది. ఇదే సమయంలో అంతర్జాతీయంగా మాత్రం బంగారం డిమాండ్ 23 శాతం క్షీణించినట్లు వెల్లడైంది. నివేదిక ద్వారా తెలిసిన మరిన్ని కీలక విషయాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఐపీఎల్​ ఆడకపోవటం అదృష్టం...

ప్రస్తుత ఐపీఎల్ సీజన్​లో ఆడకపోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆసీస్ క్రికెటర్ లబుషేన్ చెప్పాడు. దేశంలో కరోనా ఉద్ధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. సిద్ధార్థకు బెదిరింపు కాల్స్​...

తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్​కు హత్య బెదిరింపులు వస్తున్నాయి. దీనికి తమిళనాడు భాజపానే కారణమని ఇతడు ఆరోపణ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details