కొత్తగా 2,493 కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 94,189 కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 2,493 కరోనా కేసులు నమోదయ్యాయి. 15 మంది బాధితులు మహమ్మారికి బలయ్యారు. కరోనా నుంచి కోలుకున్న మరో 3,308 మంది బాధితులు కోలుకోగా... ప్రస్తుతం 33,254 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం
ధర్మాసనం ఆదేశాల అమలులో జాప్యమెందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మూడో దశ కరోనా ఎదుర్కొనేందుకు అన్నీ భవిష్యత్తులోనే చేస్తారా.. ముందస్తు చర్యలు తీసుకోరా అని ప్రశ్నించింది. కరోనా పరిస్థితులపై విచారణ చేపట్టిన ధర్మాసనం....ప్రభుత్వంపై ప్రశ్నలవర్షం కురిపించగా.... అధికారులు ధర్మాసనానికి వివరణ ఇచ్చారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
ప్రేయసి కోసం వెళ్లి.. నాలుగేళ్ల తర్వాత ..!
ప్రేయసి కోసం పాక్‌కు వెళ్లి అక్కడి చెరసాలలో శిక్ష అనుభవించిన ప్రశాంత్ కథ సుఖాంతమైంది. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత కుటుంబం చెంతకు చేరారు. శిక్ష పూర్తయినందున పాక్ అధికారులు భారత్‌కు అప్పగించగా... సైబరాబాద్ సీపీ సజ్జనార్ చొరవతో దిల్లీ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
భూముల సమగ్ర సర్వే
భూముల సమగ్ర సర్వే దిశగా సర్కారు కసరత్తు ప్రారంభించింది. భూముల డిజిటల్ సర్వే చేసే కంపెనీల ప్రతినిధులతో సీఎస్ సమావేశమయ్యారు. సర్వే చేపట్టేందుకు ఈ ఏడాది బడ్జెట్లో 400 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని సోమేశ్ కుమార్ తెలిపారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
దేశంలో కరోనా తగ్గుముఖం
దేశంలో కరోనా కేసులు(corona cases in india) క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 1,27,510 మందికి కొవిడ్ సోకింది. వైరస్ బారిన పడి మరో 2,795 మంది మరణించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.