తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్‌ టెన్ న్యూస్ @ 9 PM - టాప్‌ టెన్ న్యూస్ @ 9 PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

Top ten news till 9 PM
టాప్‌ టెన్ న్యూస్ @ 9 PM

By

Published : May 18, 2021, 9:01 PM IST

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పొడిగింపు

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 30 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. లాక్ డౌన్​ సమయాల్లో ఎలాంటి మార్పులు లేవని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

నేషనల్ హెల్త్ అథారిటీతో ఒప్పందం

నేషనల్ హెల్త్ అథారిటీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆయుష్మాన్ భారత్‌లో చేరాలన్న నిర్ణయం మేరకు ఈ ఒప్పందం చేసుకుంది. ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు విధివిధానాలని వైద్య, ఆరోగ్యశాఖ ఖరారు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

కొత్తగా 3,982 కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 71,616 నమూనాలను పరీక్షించగా 3,982 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,36,766కి చేరింది. తాజాగా మరో 27 మంది మహమ్మారికి బలవ్వగా.. మొత్తం మృతుల సంఖ్య 3,012కి పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

'తగ్గుముఖం పట్టాయి'

రాష్ట్రంలో 2 వారాలుగా కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయని డీహెచ్​ శ్రీనివాస రావు తెలిపారు. పాజిటివిటీ రేటు కూడా తగ్గిందని చెప్పారు. రెండో దశలో రాష్ట్రంలో 2.37 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

రికవరీల్లో భారత్​ రికార్డ్

భారత్​లో ఒక్క రోజులో 4,22,436 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా రికవరీ రేటు మే 3న 81.7శాతం ఉండగా ప్రస్తుతం 85.6శాతానికి పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

లద్దాఖ్​ సమీపంలో మళ్లీ చైనా సైన్యం కదలికలు

చైనా మళ్లీ సరిహద్దులో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది. తూర్పు లద్దాఖ్​ సెక్టార్​కు సమీపంలో సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. తాజా పరిస్థితుల్ని భారత సైన్యం అత్యంత నిశితంగా గమనిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

'ఆ విమానాలు ఆపండి'

కరోనా వైరస్ తొలి దశలో 45 ఏళ్లు పైబడిన వారిపై తీవ్ర ప్రభావం చూపింది. రెండో దశలో యువకులనూ వదల్లేదు. మూడో దశలో మాత్రం ఆ మహమ్మారి కన్ను చిన్నారులపై పడుతుందన్న ఆందోళనలు ఇప్పటికే మొదలయ్యాయి. ఆ ముప్పు సింగపూర్ వేరియంట్‌తో పొంచి ఉందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరిస్తున్నారు. అక్కడి నుంచి భారత్​కు విమాన సర్వీసులను నిలిపివేయాలని ప్రధానిని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

కొవిడ్ రిలీఫ్ ఆఫర్లు- రీఛార్జ్, టాక్​టైం ఫ్రీ!

కరోనా నేపథ్యంలో టెలికాం సంస్థలు తమ యూజర్లకు కొవిడ్ రిలీఫ్​ ఆఫర్లను ఇస్తున్నాయి. జియో ఫ్రీ టాక్​టైమ్ ఆఫర్​ ప్రకటించగా.. ఎయిర్​టెల్, వొడాఫోన్ ఐడియా ఫ్రీ రీఛార్జ్ ప్యాక్​ను అందుబాటులోకి తెచ్చాయి. ఈ ఆఫర్లపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

సుశీల్​ బెయిల్​ పిటిషన్​ తిరస్కరణ

భారత స్టార్ రెజ్లర్​ సుశీల్ కుమార్​కు దిల్లీ కోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్​ను న్యాయస్థానం తిరస్కరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

'వకీల్​సాబ్​' నుంచి సర్​ప్రైజ్​!

మూడేళ్ల తర్వాత పవర్​స్టార్​ రీఎంట్రీ ఇచ్చిన చిత్రం 'వకీల్​సాబ్​'.. అటు థియేటర్లలో సత్తా చాటడం సహా ఇటు ఓటీటీ ప్రేక్షకులనూ మెప్పించింది. ఈ సినిమాలోని తమన్​ కంపోజ్​ చేసిన బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​కు విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర నేపథ్య సంగీతానికి సంబంధించిన ఒరిజినల్​ ట్రాక్​ను రిలీజ్​ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details