తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana Top News: టాప్​ న్యూస్ @7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

7PM TOPNEWS
7PM TOPNEWS

By

Published : Jun 30, 2022, 6:59 PM IST

  • బిగ్ ట్విస్ట్.. 'మహా' సీఎంగా ఏక్​నాథ్ శిందే..

మహారాష్ట్ర రాజకీయాల్లో కింగ్ మేకర్​గా నిలుస్తారనుకున్న ఏక్​నాథ్ శిందే.. ఏకంగా కింగ్ అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. రాత్రి ఏడున్నరకు ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు.. మాజీ సీఎం, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు.

  • కింగ్ మేకర్ కాదు.. 'కింగ్'! రిక్షావాలా టు మహా 'సీఎం'.. ఎవరీ శిందే?

మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం ఏక్​నాథ్ శిందే! తిరుగుబాటును విజయవంతంగా నడిపించి.. ఠాక్రే సర్కారును కూల్చేసిన ఆయన.. ఇప్పుడు సీఎం పదవిని దక్కించుకున్నారు. శివసేనకు షాక్ ఇస్తూ భాజపా పక్షాన చేరిన ఆయన.. కింగ్ మేకర్​గా నిలుస్తారని అందరూ భావించారు.

  • భాజపా గూటికి కొండా విశ్వేశ్వరరెడ్డి

రాష్ట్రంలో భాజపా అధికారంలో వస్తుందన్న విశ్వాసముందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. తెరాసను ఎదుర్కోవాలంటే ఒక్క భాజపా వల్లే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. అందుకే భాజపా చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

  • ప్రపంచ టాప్ ఐటీ కంపెనీలకు రెండో అతిపెద్ద కేంద్రం మనదే: కేటీఆర్‌

దేశంలోని ఇతర మహానగరాల కంటే మౌలిక వసతులు, సదుపాయాల విషయంలో హైదరాబాద్‌ మేటి అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ మాదాపూర్‌ హెచ్‌ఐసీసీ నాస్‌కామ్‌ జీసీసీ సదస్సులో మంత్రి పాల్గొన్నారు.

  • హైదరాబాద్​లో హైసెక్యూరిటీ..

హైదరాబాద్​కు ప్రధాని రాక సందర్భంగా పోలీసులు ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు. ఆయా మార్గాల గుండా వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ దారులను సూచించారు. హెచ్​ఐసీసీ ప్రాంతంలోని పలు కార్యాలయాలపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి వేళల్లో డీసీపీ స్థాయి అధికారులు ట్రాఫిక్​ను పర్యవేక్షించనున్నారు.

  • తల్లి, కూతురు దారుణ హత్య.. మరో కుమార్తె, డ్రైవర్ ఆత్మహత్య.. ఏమైంది?

డ్రైవర్​తో కలిసి తల్లి, కూతురును హత్య చేసింది ఓ కూతురు. ఆ తర్వాత అతనితో పాటే ఆత్యహత్యకు పాల్పడింది. మహారాష్ట్ర ముంబయిలో ఈ ఘటన జరిగింది.

  • కిరాక్ ఫీచర్స్​తో మారుతి బ్రెజా 2022​..

దేశీయ ఆటోమొబైల్​ దిగ్గజం మారుతీ సుజుకీ తన ఎస్‌యూవీ బ్రెజా కొత్త వెర్షన్‌ను గురువారం లాంచ్ చేసింది. మాన్యువల్​తోపాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లలో బ్రెజా అందుబాటులోకి వచ్చినట్లు కంపెనీ ప్రకటించింది.

  • ఇంగ్లాండ్​తో టెస్టుకు రోహిత్​ దూరం..

ఇంగ్లాండ్​తో చివరిదైన ఐదో టెస్టుకు కెప్టెన్​ రోహిత్​ శర్మ దూరం అయ్యాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. స్టార్​ పేసర్​ జస్​ప్రీత్​ బుమ్రా తాత్కాలిక కెప్టెన్​గా వ్యవహరించనున్నాడని స్పష్టం చేసింది. వికెట్​ కీపర్​ బ్యాటర్​ రిషభ్​ పంత్​ వైస్​- కెప్టెన్​గా నియమితుడయ్యాడు.

  • కరోనా ముగియలేదు..

కరోనా వైరస్ సమస్య ఇంకా ముగిసిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి హెచ్చరించింది. వైరస్ కొత్త రూపంలో దాడి చేస్తోందని వెల్లడించింది. వైరస్‌ను ట్రాక్‌ చేయగల సామర్థ్యం ప్రమాదంలో ఉందని పేర్కొంది.

  • ఒటీటీలో 'మేజర్'​ ఎప్పుడంటే?

కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఇప్పటికే 'లైగర్', 'జనగణమన' చిత్రాలు చేస్తున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. త్వరలోనే మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక దేశవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకున్న అడివి శేష్ 'మేజర్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.

ABOUT THE AUTHOR

...view details