ఇప్పటివరకు ప్రధానవార్తలుచెరువులో యువతి మృతదేహం.. శామీర్‌పేట మండలం పొన్నాల చెరువులో యువతి మృతదేహం లభ్యమైంది. చేతులు కట్టేసిన స్థితిలో గుర్తుతెలియని యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.దేశంలో కరోనా ఉపద్రవం భారత్‌లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజాగా 1.59లక్షల మంది కరోనా బారిన పడ్డారు. కొవిడ్‌తో మరో 327 మంది మరణించారు. 40,863 మంది కొవిడ్‌ని జయించారు.జాతీయ రహదారిపై వాహనాల రద్దీ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. పండుగ ఇంకా వారం ఉండగానే జనం పల్లెబాటపడుతున్నారు. ఇక శనివారం నుంచి విద్యార్థులకు సెలవులు రావడంతో భారీ సంఖ్యలో ఊరెళ్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది.ఏవోబీలో మందుపాతరలు నిర్వీర్యం ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను బీఎస్ఎఫ్ బలగాలు నిర్వీర్యం చేశాయి. సరిహద్దుల్లోని ఖొరిగండి అటవీప్రాంతంలో భారీగా మందుపాతరలు, మావోయిస్టు సామగ్రిని ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు.స్థానికులకు తితిదే ఉచిత దర్శన టికెట్లు తిరుమలలో స్థానికులకు రేపటి నుంచి స్వామి వారి ఉచిత దర్శన టికెట్లను తితిదే పంపిణీ చేయనుంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ దర్శన టికెట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 13 నుంచి 22 వరకు రోజుకు 5వేల చొప్పున 50వేల టికెట్లను జారీ చేయనుంది.దైవ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం.. ఓ మినీ వ్యాన్.. మరో గుర్తుతెలియని వాహనాన్ని ఢీ కొట్టింది. ఐదుగురు మృతిచెందగా, మరో 10 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన గుజరాత్లో జరిగింది.కుల బహిష్కరణ! భూమి తగాదాకు సంబంధించిన పంచాయితీకి 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చారంటూ కొన్ని కుటుంబాలను కుల బహిష్కరణ చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పంచాయతీ పెద్దలు తమను ఆరు నెలలుగా ఇబ్బంది పెడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి.'గురుగోవింద్ జీవిత సారాంశం..' సిక్కుమత గురువు గురు గోవింద్ సింగ్ 355వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్.. ఆయన్ను స్మరించుకున్నారు. గురు గోవింద్ జీవిత సారాంశం లక్షలమందికి ధైర్యాన్నిస్తుందని ట్వీట్ చేశారు ప్రధాని మోదీ.రాస్ టేలర్ మరో రికార్డు.. న్యూజిలాండ్ సీనియర్ బ్యాటర్ రాస్ టేలర్ టెస్టు క్రికెట్లో మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బరిలో దిగడం ద్వారా ఈ ఘనత సాధించాడు. ఆ రికార్డు ఏంటంటే?రమేశ్‌బాబు మృతి పట్ల ప్రముఖుల సంతాపం సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సోదరుడు రమేశ్‌బాబు మృతి పట్ల పలువురు సినీప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు నివాళులు అర్పించి.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.