ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో ఈ సారి బడ్జెట్లో పెద్దగా తాయిలాలు, వినూత్న సంస్కరణల జోలికి వెళ్లకుండానే ఆర్థిక మంత్రి కసరత్తు పూర్తిచేసే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత రెండేళ్లుగా కొవిడ్ మహమ్మారితో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ ఈ బడ్జెట్‌పై చాలా ఆశలు పెట్టుకొందని చెప్తున్నారు.
- 'రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిద్దాం'
కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలోని ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని తెరాస నిర్ణయించింది. పార్లమెంటు సమావేశాల్లో తెరాస సత్తా చూపాలని, దేంట్లోనూ వెనక్కి తగ్గకూడదని, రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలపై పార్లమెంటు లోపలా.. బయటా గట్టిగా పోరాడాలని, బలమైన వాణి వినిపించాలని తీర్మానించింది.
- కొత్త రిజిస్ట్రేషన్ విలువల పెంపు అమలుకు సర్వం సిద్ధం
రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ విలువల అమలుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ సర్వం సిద్ధం చేసింది. జిల్లాల్లో విలువల పెంపు కమిటీల ఆమోదం పూర్తి కావడంతో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే ఎన్ఐసీ సహకారంతో వాటిని సాప్ట్‌వేర్‌లో అప్‌డేట్ చేయనుంది.
- రాష్ట్రానికి తోడ్పాటు అందేనా?
కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్రానికి అందే తోడ్పాటుపై ఆసక్తి నెలకొంది. పన్నుల వాటా, గ్రాంట్లు, ఆర్థికసంఘం సిఫార్సులకు అనుగుణంగా నిధులతో పాటు విభజనచట్టం హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇప్పటికే విజ్ఞప్తులు పంపింది.
సమాజంలో పెద్దమనిషిగా చలామణి అవుతూ, కుమార్తె వయసున్న బాలిక (14) పట్ల వక్ర బుద్ధిని ప్రదర్శించాడో దుర్మార్గుడు. అతని అసభ్యకర మాటలు, లైంగిక చేష్టలను భరించలేకపోయిన బాలిక నిస్సహాయ స్థితిలో తనువు చాలించింది. తాము నివాసం ఉండే అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఏపీలోని విజయవాడలో జరిగింది.