ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుదేశంలో మరో 50వేల కరోనా కేసులు. దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. తాజాగా 50,407 మందికి వైరస్ సోకింది. మరో 804 మంది మరణించారు. 1,36,962 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.ఈ ద్రావణంతో వైరస్ ఖతంకరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు సరికొత్త పదార్థాన్ని తయారు చేశారు. దీనిని బట్టలపై పూసుకుంటే కొవిడ్ నుంచి సుమారు 90 శాతం వరకు ముప్పు తగ్గుతుందని తెలిపారు.భాజపా-ఎస్‌పీ మధ్య తీవ్ర పోటీ ఉత్తర్‌ప్రదేశ్‌లో అయిదేళ్ల క్రితం సాధించిన అపూర్వ విజయాన్ని కమలదళం పునరావృతం చేయడం కష్టసాధ్యంగా కనపడుతోంది. ఆ విషయాన్ని గమనించే కాబోలు- మిగిలిన ఆరు దశల ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై భాజపా నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. తుపాకీ మిస్‌ఫైర్.. హెడ్‌కానిస్టేబుల్ మృతిభద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాచనపల్లి పోలీస్‌స్టేషన్‌లో విషాదం చోటుచేసుకుంది. తుపాకీ మిస్‌ఫైర్ అయి హెడ్‌కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఆయుధాలు పరిశీలిస్తుండగా ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. టాలీవుడ్ డ్రగ్ కేసుపై మరోసారి ఈడీ ఫోకస్టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి ఫోకస్ చేసింది. ఈ కేసులకు సంబంధించి కీలకమైన డిజిటల్ రికార్డులను అప్పగించాలని ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది.మామిడి పండ్లకు రికార్డ్ ధర సాధారణంగా మార్కెట్లో మామిడి పండ్ల ధర ఎంత ఉంటుంది? కిలోకి గరిష్ఠంగా రెండు వందలు ఉండొచ్చు. అదే పెట్టెకు వెయ్యి, రెండు వేలు పలుకుతుంది. కానీ, మహారాష్ట్రలోని పుణె మార్కెట్లో ఒక్క ట్రే.. ఏకంగా రూ.31వేలు పలికింది. మార్కెట్ 50 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యధికం కావటం గమనార్హం. 'రెండు రోజుల్లో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర'ఉక్రెయిన్‌పై రష్యా రెండు రోజుల్లో దందయాత్ర చేస్తుందని అమెరికా తెలిపింది. తమ ప్రజలంతా ఆ దేశం నుంచి వచ్చేయాలని సూచించింది. వీలైనంత త్వరగా అమెరికన్లు బయల్దేరాలని పేర్కొంది.కనీస ధర రూ.2 కోట్లు.. టీమ్‌ఇండియా నుంచి వీరే! ఈ ఐపీఎల్ మెగా వేలంలో అత్యంత ఆకర్షణీయమైన కనీస ధర (బేస్ ప్రైస్) రూ. 2 కోట్లు. ఈ కనీస ధరలో భారత్‌కు చెందిన 17 మంది టాప్ ప్లేయర్లు ఉన్నారు. వారు ఎవరో చూడండి.గత సీజన్‌లో అదిరిపోయే ధర.. ఈసారి పరిస్థితి ఏంటి?ఐపీఎల్ మెగావేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ వేలంలో ఏ ఆటగాడు అత్యధిక ధర దక్కించుకుంటాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. అయితే మ్యాచ్ విన్నర్‌గా మారతాడని భావించి గతంలో రూ.కోట్లు కుమ్మరించి ఫ్రాంఛైజీలు తీసుకున్న ప్లేయర్లు చేతులెత్తేసిన సందర్భాలూ ఉన్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉందంటే?షూటింగ్‌లో గాయపడ్డ నటుడు విశాల్ ప్రముఖ తెలుగు, తమిళ నటుడు విశాల్‌కు గాయలయ్యాయి. 'లాఠీ' సినిమా చిత్రీకరణ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.