తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్ న్యూస్ @ 7AM - top news in telangana

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news in telangana
top news in telangana

By

Published : Feb 12, 2022, 7:00 AM IST

  • నేడు యాదాద్రి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

సీఎం కేసీఆర్​ జిల్లాల పర్యటనలో భాగంగా నేడు యాదాద్రి భువనగిరి జిల్లాకు వెళ్లనున్నారు. యాదాద్రిలో ప్రెసిడెన్షియల్​ సూట్​ను, భువనగిరిలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్​ను ప్రారంభించనున్నారు. అనంతరం రాయగిరిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.

  • సర్కార్‌ స్థలాలకు మళ్లీ వేలం

టీఎస్‌ఐఐసీ, హెచ్‌ఎండీఏ, జిల్లాల పరిధిలోని భూముల అమ్మకానికి వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 14 నుంచి 17 వరకు 1,408 ప్లాట్లకు వేలం నిర్వహణ జరుగనుంది. టీఎస్​ఐఐసీ, హెచ్​ఎండీఏ పరిధిలోని స్థలాల సమాచారం, బ్రోచర్లు ఆయా సంస్థల వెబ్‌సైట్లలో, జిల్లాల్లోని ప్రభుత్వ భూముల వివరాలు సంబంధిత జిల్లాల అధికారిక వెబ్‌సైట్లలో ఉంటాయని వెల్లడించింది.

  • పేదల అధీనంలోని ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ

రాష్ట్రంలో పట్టణాలు, నగరాల్లో పేదల అధీనంలో ఉన్న ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం ఇచ్చే దిశగా ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. గతంలో జీవో 58 ద్వారా ప్రభుత్వం అనుమతిచ్చింది. అప్పుడు 125 చదరపు గజాల వరకు ఉచిత క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. తాజాగా ఎంత విస్తీర్ణాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి.. ఎప్పటి వరకు కటాఫ్‌ తేదీని నిర్ణయించాలనే అంశాలను పరిశీలిస్తున్నారు.

  • మహేశ్‌బ్యాంక్‌ కేసులో ప్రధాన నిందితుల వేట

హైదరాబాద్‌లోని ఏపీ మహేశ్‌ బ్యాంక్‌పై సైబర్‌దాడి కేసులో పోలీసులు ఎంతగా శ్రమిస్తున్నా రూ.12.90కోట్లు కాజేసిన ప్రధాన నిందితులు కాకుండా వారు ఆడించిన పాత్రధారులే దొరుకుతున్నారు. కేరళ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకూ వేర్వేరు ప్రాంతాల్లో వేట కొనసాగిస్తున్న హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు.. నైజీరియన్లకు బ్యాంకు ఖాతాలు సమకూర్చిన నలుగురు నిందితులను తాజాగా అరెస్ట్‌ చేశారు.

  • వలపు వలతో కోట్లు కొల్లగొట్టిన ముఠా అరెస్ట్​

తెలిసిన వ్యక్తిలా చాటింగ్‌.... తీయటి మాటలతో డేటింగ్... వలపు వల విసిరి నగ్న వీడియో కాలింగ్...! చివరకు ఆ వీడియోలు వైరల్‌ కావొద్దంటే డబ్బులు కట్టాలంటూ బ్లాక్‌మెయిలింగ్..! వలపు వల విసురుతూ.... నగ్న వీడియోలు సేకరించి నట్టేట ముంచుతున్న ముఠా గుట్టును హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు ఛేదించారు.

  • రోడ్డుపై రిటైర్డ్ కలెక్టర్ కుమారుడి వీరంగం

దిల్లీలోని గ్రేటర్​ కైలాష్​ ప్రాంతంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు నడుపుతున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కుమారుడు ఓ యువకుడ్ని బలంగా ఢీకొట్టి కొద్దిదూరం ఈడ్చుకెళ్లాడు. అనంతరం అక్కడ ఆగకుండా వేగంగా పారిపోయాడు. ఈ దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డు అయ్యాయి.

  • కాలేజీల్లో ప్రత్యక్ష తరగతులు

ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు దేశంలోని కాలేజీలకు, యూనివర్సీటలకు అనుమతిని ఇచ్చింది యూజీసీ. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ లేదా రెండు రకాలుగా తరగతులు, పరీక్షలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది.

  • కిమ్​తో టచ్​లో డొనాల్డ్​ ట్రంప్​!

ఇప్పటికీ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్​తో తాను టచ్​లో ఉన్నట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చెప్పినట్లు న్యూయార్క్​ టైమ్స్​ రిపోర్టర్ మాగీ హెబర్మన్​ వెల్లడించారు. ఆమె విడుదల చేయనున్న పుస్తకంలో ఈ విషయాన్ని పేర్కొన్నట్లు తెలిపారు.

  • అనిల్​ అంబానీకి సెబీ షాక్

సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్​ అంబానీపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసింది.

  • బుల్లితెరపై నటి రోజా హోం టూర్‌!

సీనియర్​ నటి రోజా హోంటూర్​ బుల్లితెరపైకి వచ్చింది. టీవీ ఛానల్‌లో హోంటూర్‌ ప్రసారం కావటం ఇదే తొలిసారి.

ABOUT THE AUTHOR

...view details