తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్ న్యూస్ @1 PM - top news in telangana

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్ న్యూస్ @1 PM
టాప్ న్యూస్ @1 PM

By

Published : Jan 31, 2022, 1:01 PM IST

  • వ్యాక్సినేషన్​తో దేశ శక్తిసామర్థ్యాలు ప్రపంచవ్యాప్తం

కరోనా వైరస్​పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పోరాడాయని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా భారత శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయన్నారు. ఈ మేరకు పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు.

  • సుప్రీం కోర్టుకు సిర్పూర్కర్ కమిషన్ నివేదిక

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో సిర్పూర్కర్‌ కమిషన్ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. 47 రోజులపాటు క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన సిర్పూర్కర్ కమిషన్.... ఈనెల 28న సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది.

  • గోవాలో 'వలస' రాజకీయం

గోవాలో ఫిరాయింపుల రాజకీయం నడుస్తోంది. నేతలు యథేచ్ఛగా పార్టీలు మారిపోతున్నారు. కాంగ్రెస్ నుంచి నేతల్ని తెచ్చుకున్నప్పటికీ టీఎంసీకి.. అభ్యర్థులే కరవవుతున్నారు. కాంగ్రెస్​ సైతం వలసలతో సతమతమవుతోంది.

  • అరగుండుతో యువతి ఊరేగింపు కేసులో మరో ట్విస్ట్​

దిల్లీ యువతిని చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితులు తనను కూడా లైంగికంగా హింసించారని బాధితురాలు సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  • ఈసారైనా విభజన హామీలు అమలు చేయాలి

రాష్ట్రం ప్రగతి పథాన దూసుకుపోతున్నా... కేంద్రం నుంచి సహకారం మాత్రం దక్కడం లేదని ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్‌లో డ్రిల్‌మెక్‌ స్పా సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకున్న కార్యక్రమంలో... మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రపంచ స్థాయి సంస్థలు తరలిరావడం..... సీఎం కేసీఆర్‌ అద్భుత పాలనకు నిదర్శనమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

  • బైపాస్‌ సర్జరీల్లో భారత్ భేష్‌

మనదేశంలో బీటింగ్‌ హార్ట్‌ సర్జరీలు ఎక్కువగా చేస్తుంటారు. ఈ సర్జరీల్లో నిపుణుడైన ప్రముఖ కార్డియోథొరాసిస్‌ సర్జన్‌ డాక్టర్‌ సజ్జా లోకేశ్వరరావు సహా ఏడుగురు వైద్య నిపుణులు అధ్యయనాన్ని చేపట్టారు. లండన్‌కు చెందిన ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ సర్జరీ’ నిపుణుల బృందం ఈ స్టడీ ఫలితాలను ఫిబ్రవరి సంచికలో ప్రచురించింది. ఈ అద్భుత విజయంపై డాక్టర్‌ సజ్జాను మంత్రి హరీశ్ అభినందించారు.

  • 60 అంతస్తుల భవనం నుంచి దూకి మిస్​ అమెరికా 'ఆత్మహత్య'

మిస్ యూఎస్​ఏ 2019 కిరీటాన్ని గెలుచుకున్న చెస్లీ క్రిస్ట్(30) మృతి చెందారు. 60 అంతస్తుల భవనం నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తనను కలచివేసిందని మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు అన్నారు.

  • ధోనీతో విభేదాలు లేవు

ధోనీతో తనకు విభేధాలు ఉన్నాయని వస్తున్న వార్తలకు చెక్​ పెట్టాడు మాజీ క్రికెటర్​ హర్భజన్​ సింగ్​. తామిద్దరి మధ్య మంచి స్నేహం ఉందని చెప్పాడు.

  • థియేటర్/ఓటీటీలో ఈ వారం రిలీజయ్యే సినిమాలు

ఎప్పటిలానే ఈ వారం కూడా పలు సినిమాలు ఆడియెన్స్​ను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఇంతకీ ఆ చిత్రాలేంటి? వాటి సంగతేంటి?

  • కీర్తి సురేశ్​కు కరోనా ప్రతి వేవ్​లోనూ ఎదురుదెబ్బలే!

కరోనా ఎంత ప్రభావం చూపినా సరే తెలుగు సినిమా ఇండస్ట్రీ బలంగా నిలబడింది. చిన్నా పెద్దా సినిమాలతో హిట్​లు కొట్టి, వేరే సినీ పరిశ్రమలకు ధైర్యాన్నిచ్చింది. అయితే ఈ కరోనా టైమ్​లోనే కీర్తి సురేశ్​కు​ మాత్రం వరుసగా ఎదురుదెబ్బలే తగిలాయి! ఇంతకీ ఆ విషయం ఏంటంటే?

ABOUT THE AUTHOR

...view details