ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుఇవాళ తెరాస పార్లమెంటరీ పార్టీ భేటీ ఫిబ్రవరి 1నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా.... ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతిభవన్‌లో తెరాస పార్లమెంటరీ పార్టీ భేటీ జరగనుంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభ, రాజ్యసభల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని సీఎం ఖరారు చేయనున్నారు.తెలంగాణను వణికిస్తున్న శీతలగాలులు రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు అసాధారణంగా పడిపోతున్నాయి రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పూట ఇళ్లల్లో నుంచి బయటకు వస్తే ఒళ్లు జలధరించేలా ఇగం ఇంతకింతకు తన జోరుని పెంచుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో శీతలగాలులు వీస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక జారీచేసింది.త్రీడీ ఎఫెక్ట్‌లో శ్రీరామానుజాచార్యుల విగ్రహం ముచ్చింతల్‌లో రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2 నుంచి వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రామానుజాచార్యుల భారీ విగ్రహం విద్యుదీపాలతో వెలిగిపోతోంది. విగ్రహం మీద పడే విధంగా ఏర్పాటు చేసిన త్రీడీ ఎఫెక్ట్ విశేషంగా ఆకట్టుకుంటోంది.'నేరగాళ్లను పోటీ చేయనీయొద్దు' ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటుంటే.. వారిని అనర్హులుగా గుర్తించేలా ఉత్తర్వులు ఇవ్వాలని 2020లో ఓ పిల్ దాఖలైంది. అయితే ఆ పిల్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు తాజాగా అంగీకారం తెలిపింది.'కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుందాం' ప్రస్తుత పరిస్థితుల్లో భారత్, ఇజ్రాయెల్ సంబంధాల ప్రాముఖ్యత మరింత పెరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్, ఇజ్రాయెల్ మధ్య దౌత్య సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.102 ఏళ్ల వయసులో పద్మశ్రీ అసోంకు చెందిన గాంధేయవాది శకుంతలా చౌదరిని పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది కేంద్రం. ప్రజల సేవకు అంకితమైన ఈ సమర యోధురాలికి 102 ఏళ్ల వయసులో పద్మ పురస్కారం ప్రకటించడం పట్ల ఆమె కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు. ఆమెకు ఈ అవార్డును ఎప్పుడో ఇవ్వాల్సిందని అన్నారు. కానీ, అసలే ఇవ్వకపోవడం కంటే ఆలస్యంగా అయినా ప్రకటించడం కొంతవరకు సంతోషమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు.మార్చిలో ఎల్ఐసీ ఐపీఓ ఎప్పటి నుంచో మార్కెట్ వర్గాలు ఎదురు చూస్తున్న ఎల్ఐసీ ఐపీఓకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. పబ్లిక్ ఇష్యు కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ (సెబీ) నిర్ధేశించిన పత్రాలను సిద్ధం చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. వీటిని ఫిబ్రవరి మొదటి వారంలో సెబీ కి అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.రష్యాలో జనాభా సంక్షోభం రష్యాలో కొవిడ్ విజృంభణ, ఇతరత్రా కారణాలతో.. గతేడాది దేశ జనాభా భారీగా పడిపోయింది. ఏకంగా పది లక్షలకంటే ఎక్కువమంది తగ్గిపోయినట్లు ప్రభుత్వ గణాంకాల సంస్థ 'రోస్‌స్టాట్' తాజాగా వెల్లడించింది. సోవియట్ యూనియన్ పతనం తర్వాత మొట్టమొదటిసారిగా ఈ స్థాయిలో క్షీణత నమోదు కావడం గమనార్హం. కొవిడ్ బారినపడే 6.60 లక్షల మంది మరణించినట్లు రోస్‌స్టాట్ తెలిపింది.'విరాట్‌ని దిగ్గజ కెప్టెన్లతో పోల్చలేం' టీమ్ ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్. విరాట్‌ను దిగ్గజ కెప్టెన్లతో పోల్చలేమని అన్నాడు.అండర్-19 ప్రపంచకప్‌లో సెమీస్ చేరిన భారత జట్టు అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ జట్టు సెమీస్‌కు చేరింది. బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో నెగ్గి సెమీస్‌లో అడుగు పెట్టింది.