ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుభారత్ @ 3 లక్షల 33 వేల కొత్త కేసులు Covid cases in India: భారత్‌లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. మరో 3,33,533 మందికి వైరస్ సోకింది. ఒక్కరోజులో 525 మంది మరణించారు. 2,59,168 మంది కొవిడ్‌ను జయించారు.బడికి దూరమై.. పెడ ధోరణి అధికమై Effect of Holidays on Children's Behavior: కరోనా మహమ్మారి, లాక్డౌన్ వల్ల రెండేళ్లు పిల్లలంతా పాఠశాలలకు దూరమయ్యారు. ఇప్పుడిప్పుడే బడులు తెరుచుకుని విద్యార్థులంతా పాఠశాల బాట పడుతోంటే.. ఒమిక్రాన్ వేరియంట్, కొవిడ్ మూడో దశ మళ్లీ వాళ్లని ఇంట్లో కూర్చోబెట్టేస్తున్నాయి. నేతాజీకి కోవింద్, మోదీ నివాళులు Subhash chandra bose birth anniversary: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు పరాక్రమ్ దివస్ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ. బోస్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న ఓ ఫొటోను ట్విట్టర్లో మోదీ షేర్ చేశారు. NDRF ట్విటర్ ఖాతా హ్యాక్ NDRF Twitter Hacked: ఎన్డీఆర్ఎఫ్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. వెంటనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది.కట్టుకున్న లుంగీనే ప్రాణం తీసింది.. Thief died at chandrayangutta: దొంగతనం కోసం వచ్చిన ఓ వ్యక్తి... చోరీ యత్నంలో మృతి చెందాడు. గేటు దూకుతుండగా... తాను కట్టుకున్న లుంగీనే అతనికి మృత్యుపాశమైంది. చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది.తెల్లవారుజామునే కత్తిపోట్ల కలకలం Knife attack at Begumpet: హైదరాబాద్‌లో తెల్లవారుజామున కత్తిపోట్లు కలకలం రేపాయి. డబ్బులు ఇవ్వలేదని నలుగురు యువకులు వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. బేగంపేట ఇలాహీ మసీదు వద్ద ఈ ఘటన జరిగింది.ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే? Gold Price Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధర స్థిరంగా ఉంది. ఇంధన ధరల్లోనూ ఏ మార్పూ లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.IPL 2021 రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు ఎవరంటే? IPL 2022 Mega Auction: ఐపీఎల్-2022 కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ లీగ్ కోసం జరగబోయే మెగా వేలం కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫిబ్రవరి 12,13న ఈ వేలం జరగనుంది. కోహ్లీ, రోహిత్ రాణించకపోతే ? Hafeez about Rohit Kohli: ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో భాగంగా తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడబోతోంది టీమ్ఇండియా. విజయ్ దేవరకొండ ఫేవరెట్ హీరోహీరోయిన్లు ఎవరంటే? సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా ఉండే నటుల్లో విజయ్ దేవరకొండ ముందుంటాడు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే ఈ లైగర్ హీరో.. ఇష్టాయిష్టాలనూ చెప్పేస్తున్నాడిలా!