- భారత్ @ 3,49,786
దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. ఒక్కరోజే 3,49,786 మందికి పాజిటివ్‌గా తేలింది. మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొత్తగా 2,767 మంది వైరస్‌కు బలయ్యారు. 2,17,113 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. వరుసగా నాలుగో రోజూ భారత్‌లో 3 లక్షలకుపైగా కేసులు వెలుగుచూశాయి. పలు రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- తెలంగాణ @8,126
రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా కేసులు రికార్డులు తిరగరాస్తున్నాయి. కొత్తగా ఒక్కరోజులోనే 8వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి.... 8 గంటల నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకు.... 1,08,602 మందికి పరీక్షలు నిర్వహించగా... 8,126 మందికి పాజిటివ్ వచ్చినట్టు తేలింది. మరో 38 మంది మహమ్మారికి బలయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- టీకా పంపిణీలో భారత్ రికార్డు!
ప్రపంచంలోనే వేగంగా టీకాలు పంపిణీ చేస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. కేవలం 99 రోజుల్లోనే 14 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించడం ద్వారా ఈ ఘనత సాధించినట్లు కేంద్రం ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- తాగునీటితో కరోనా వ్యాపించదు
టీకాలు, జాగ్రత్తలతో రెండునెలల్లో కొవిడ్ అదుపు చేయగలుగుతామని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్ర పేర్కొన్నారు. తాగునీటి ద్వారా కొవిడ్ వ్యాప్తి చెందిన కేసులు మనదేశంలో ఎక్కడా నమోదు కాలేదన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కరోనా కోరల్లో పసిప్రాణం
కరోనా మహమ్మారి.. కన్నవాళ్లకు బిడ్డల్ని దూరం చేస్తోంది. అమ్మ ఒడిలో సేదతీరాల్సిన ఓ చిన్నిప్రాణం చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో పోరాడుతోంది. నిన్న మొన్నటి వరకు తన బోసినవ్వుతో ఇంట్లో సందడి చేసిన ఆ బాబు.. తిరిగొస్తాడో రాడోనని ఆ కన్నతల్లి గుండె కలవరపడుతోంది. కరోనా సోకిన తొమ్మిది నెలల పసికందు చికిత్స కోసం ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారు ఆ తల్లిదండ్రులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కొవిడ్‌ను జయించిన శతాధిక వృద్ధుడు