- ఆక్సిజన్ కొరతతో 20 మంది మృతి..
దిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో 20 మంది కరోనా రోగులు మృతి చెందారు. ఆక్సిజన్ కొరతతో శుక్రవారం రాత్రి మరణించారు. ప్రస్తుతం అరగంటకు మాత్రమే ఆక్సిజన్ నిల్వలు ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 200 మందికి పైగా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్లు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఒక్కరోజే 3.46 లక్షల కేసులు
దేశంలో కరోనా కోరలు చాస్తోంది. తాజాగా 3.46 లక్షల మందికిపైగా వైరస్ బారిన పడ్డారు. మరో 2,624 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- తెలంగాణ @ 7,432
తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం కొత్తగా 7,432 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 33 మంది మృతి చెందారు. తాజాగా 2,152 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- నన్ను బతికించండి..
‘నన్ను ఎలాగైనా బతికించండి. నేను లేకుంటే పిల్లలు అనాథలవుతారు. అమ్మనాన్న తట్టుకోలేరు..’ అంటూ మూడు రోజులుగా మిత్రుల్ని పదేపదే వేడుకున్న ఓ యువకుడు (38) కరోనాతో పోరాడుతూ శుక్రవారం కన్నుమూశాడు. ఈ హృదయవిదారకర సంఘటన హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- వైద్య, ఆరోగ్యశాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
వైద్య, ఆరోగ్యశాఖకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించాలని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఊపిరితిత్తులను బలోపేతం చేసే ఆసనాలు