తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @11AM - telangana top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news in telangana today till now
టాప్​టెన్ న్యూస్ @11AM

By

Published : Mar 21, 2021, 10:59 AM IST

  • భారత్​ @ 43వేలు​

దేశంలో కొవిడ్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. ఒక్కరోజే దాదాపు 43 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. 22,956 మంది వైరస్​నుంచి కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తెలంగాణ @ 394

రాష్ట్రంలో కొవిడ్​ కేసుల ఉద్ధృతి పెరుగుతోంది. శనివారం.. 64,898 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 394 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆ ఒక్కటీ.. ఆగేనా?

కేరళలోని నెమోమ్‌ అసెంబ్లీ సీటు ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రాష్ట్రంలో తమ ఏకైక సిట్టింగ్‌ స్థానమైన ఆ నియోజకవర్గాన్ని తిరిగి దక్కించుకునేందుకు భాజపా పక్కా ప్రణాళికలు రచిస్తుండగా.. ఉన్న ఆ ఒక్క సీటునూ కమలనాథుల నుంచి లాక్కొని కేరళను 'భాజపారహిత రాష్ట్రం'గా మార్చాలని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌, సీపీఎం నాయకత్వంలోని ఎల్‌డీఎఫ్‌ గట్టి పట్టుదలతో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • సీంను మార్చాల్సిందే

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పపై ఆ పార్టీ ఎమ్మెల్యే పాటిల్​ యత్నాల్​ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు పూర్తికాగానే సీఎంను మారుస్తారని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అంబులెన్సును ఢీకొట్టిన ట్రక్కు

ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. రోగులతో వెళుతున్న అంబులెన్సును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గరు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • దూకేస్తా..

తన ప్రేయసిని పెళ్లికి ఒప్పించేందుకు ఓ యువకుడు 'హైవోల్టేజ్ డ్రామా' సృష్టించాడు. ఎత్తైన విద్యుత్ టవర్​ను ఎక్కి.. దిగనని మొండికేశాడు. స్థానికులకు షోలే సినిమాను గుర్తుచేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • సిరియాలో పేలుడు

సిరియాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. మరో ఐదుగురు క్షతగాత్రులయ్యారు. అగ్నిమాపక దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • డిజిటల్‌ మోసాలకు టెక్నాలజీతో కళ్లెం

ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆన్​లైన్​ మోసాలు వెలుగుచూస్తున్నాయి. బ్యాంకులు తమ ఖాతాదారులను అప్రమత్తం చేస్తున్నా.. ఏదో ఒక రకంగా వినియోగదారులు సైబర్​ నేరాలకు గురవుతున్నారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈనాడుకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ అనుబ్రత బిశ్వాస్. అవేంటో చదివేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అభిమాని టచ్ చేస్తే..

లీగ్ ప్రారంభానికి ముందు ఫ్రాంచైజీలు, క్రికెటర్లు పాటించాల్సిన కొన్ని నిబంధనల్ని బీసీసీఐ విడుదల చేసింది. ఇంతకీ అవేంటి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 'పుష్ప' విలన్ ఎవరంటే?

అల్లుఅర్జున్​ కొత్త చిత్రం 'పుష్ప' సినిమాలో ప్రతినాయక పాత్రపై క్లారిటీ వచ్చేసింది. మలయాళ నటుడు ఫహాద్​ ఫాజిల్​ ఇందులో విలన్​గా నటిస్తున్నారని చిత్రబృందం ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details