తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 9AM - telangana top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top-ten-news-in-telangana-today-till-now
టాప్​టెన్ న్యూస్ @ 9AM

By

Published : Feb 28, 2021, 8:56 AM IST

  • రామగుండంఎరువుల పరిశ్రమలో ట్రయల్‌ రన్‌

ఎన్నోఏళ్లుగా ఎదురుచూస్తున్న రామగుండం ఎరువుల పరిశ్రమలో యూరియా ఉత్పత్తి గ్రేడ్-1 ట్రయల్ రన్ ప్రారంభమైంది. రెండు దశాబ్దాల క్రితం మూతపడిన పరిశ్రమలో రాత్రి రెండున్నర గంటలకు అధికారులు ట్రయల్ ‌రన్ ప్రారంభించారు‌. మొత్తం రూ.6వేల 180కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రాజెక్టును చేపట్టగా... అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నీమ్ కోటెడ్ యూరియా ఉత్పత్తి జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • నేడు నింగిలోకి రాకెట్

ఇస్రో నుంచి మొదటిసారిగా నేడు దేశీయ, ప్రైవేటు సంస్థలకు చెందిన 19 ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సర్వం సిద్దం చేశారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ ఏడాది జరుగుతున్న మొదటి ప్రయోగం ఇదే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు కసరత్తు

ఆదాయ అంచనాలను చేరుకోని పరిస్థితుల్లో.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ సిద్ధమవుతోంది. జనవరి నెలాఖరు వరకు చూస్తే రాష్ట్ర రెవెన్యూ అంచనాలను 52 శాతాన్ని మాత్రమే చేరుకొంది. పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం అంచనాల్లో 6‌0 శాతానికి లోబడే ఉంది. వచ్చే ఏడాది కేంద్రం నుంచి వచ్చే నిధులు, అప్పుల అవకాశం, సొంత నిధుల అంచనా ఆధారంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • దిక్కుతోచని స్థితిలో మక్కల రైతులు..

దేశవ్యాప్తంగా మక్కల ధర పతనమవుతోంది. వానాకాలం నాటి మక్కలే గోదాముల్లో మగ్గుతోందని మార్క్‌ఫెడ్‌ చెబుతుండగా... మరోవైపు మక్కలకు ధర పడిపోతుండడంతో... రైతులు ఆందోళన చెందుతున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • హెచ్​ఐవీ జంటకు సీఎం ఆశీర్వాదం

ఒడిశాలో ఇద్దరు హెచ్​ఐవీ పాజిటివ్​ వ్యక్తుల కల్యాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం మద్దతుగా నిలిచింది. గంజమ్ జిల్లా కలెక్టర్​ వారికి దగ్గరుండి విహాహం జరిపించగా.. సీఎం నవీన్ పట్నాయక్ వర్చువల్​గా దీవించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అక్కడ కల్తీ చేస్తే జీవిత ఖైదే!

ఆహార కల్తీని అరికట్టేందుకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అక్కడ ఎవరైనా తినే పదార్థాలను కల్తీ చేసినట్లు తేలితే వారికి జీవితకాల శిక్ష విధించేలా చట్టాల్లో మార్పులు చేసింది. ఈ సవరణలకు రాష్ట్ర కేబినెట్‌ తాజాగా ఆమోదముద్ర వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తరుణ్‌ బజాజ్‌కు ఆ బాధ్యతలు

కేంద్ర ఆర్థిక శాఖలోని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి బాధ్యతలను ఐఏఎస్ అధికారి తరుణ్ బజాజ్​కు అప్పగించింది కేంద్రం. ప్రస్తుతం ఈ హోదాలో ఉన్న అజయ్ భూషణ్ పాండే ఆదివారం పదవీ విరమణ చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అలస్కాలో భూకంపం

అమెరికాలోని అలస్కాలో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 5.3 తీవ్రత నమోదైంది. ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఎలా ఆడాలో చూపించాడుగా

టెస్టు బ్యాట్స్​మన్​గా ఉన్నప్పుడు ఎలాంటి బంతినైనా ఎదుర్కోవాల్సిందేనని లెజెండరీ క్రికెటర్​ సునీల్​ గావస్కర్​ అన్నారు. ఇటీవలే పింక్​-బాల్​ టెస్టు పిచ్​పై వస్తున్న భిన్నాభిప్రాయలపై స్పందించిన ఆయన.. పరుగులు ఎలా చేయాలో టీమ్ఇండియా ఓపెనర్​ రోహిత్​శర్మ చూపించాడని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఏది కావాలో తేల్చుకో

ఏడేళ్ల క్రితం దృశ్యం, ఇప్పుడు దృశ్యం-2...! ఉత్కంఠతో ప్రేక్షకుల గుండె లయని పరుగులెత్తించడమే కాదు... వాళ్ల కళ్లనీ తడిచేయడం వల్లే ఈ సినిమాలు కోట్లు కురిపిస్తున్నాయి. దేశం మెచ్చిన ఈ చిత్రాల సృష్తికర్త జీతూ జోసఫ్‌. ఓ పెద్ద సంక్షోభాన్ని ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం 'ఒకరి కోసం ఒకరం' అన్నట్టు ఎదుర్కొనే తీరే ఈ సినిమాలను మిగతా క్రైమ్‌ థ్రిల్లర్‌లకన్నా భిన్నంగా నిలుపుతోంది! 'ఆ ఫ్యామిలీ సెంటిమెంట్‌' నా జీవితంలో నేను స్వయంగా చూసింది... నిజానికి అదే నా జీవితాన్ని నిలిపింది!' అంటాడు జీతూ. ఎందుకో చూడండి...పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details