కాళేశ్వరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ముందుగా కాళేశ్వర, ముక్తేశ్వరస్వామిని కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
రాజ్ భవన్ ఘెరావ్ కార్యక్రమంలో భాగంగా లుంబినీ పార్క్ నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీగా వెళ్లి గవర్నర్‌కు వినతిపత్రం ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసి కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కాళేశ్వరం మూడో టీఎంసీపై విచారణ
కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ అంశంపై దాఖలైన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అత్యవసర విచారణ జరపాలని న్యాయస్థాన్ని న్యాయవాది రంగయ్య కోరారు. గతంలో దాఖలు చేసిన పిల్‌పై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకపడ్డారు. అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా ఏకంగా ఓ గ్రామాన్ని నిర్మించిందని వస్తున్న వార్తల నేపథ్యంలో జాతీయ భద్రతా సమస్యపై రాహుల్ గాంధీ విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
దిల్లీలో రైతులు పోలీసుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. సింఘూ సరిహద్దు వద్దకు ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీ పోలీస్ అధికారులు చేరుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవం రోజు అతిథులకు వడ్డించే విందు పసందైన వంటకాలతో నోరూరించనుంది. కమలా హారిస్‌కు ఎంతో ఇష్టమైన సీఫుడ్‌ను ప్రధానంగా వడ్డించనున్నారు. శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన రాబర్ట్ డోర్సేకు ఈ క్యాటరింగ్ ఆర్డర్ దక్కింది. కమల, డోర్సేలు చిన్నప్పుడు ఒకే పాఠశాలలో చదువకోవడం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
చిలీ, ఉత్తర అర్జెంటీనా సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. సోమవారం రాత్రి ఏర్పడిన ఈ భూకంపం ధాటికి ప్రజలు వణికిపోయారు. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదైంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- అదానీ గ్రీన్ ఎనర్జీలో 'టోటల్'కు 20% వాటా
అదానీ గ్రీన్ ఎనర్జీలో ఫ్రాన్స్ చమురు సంస్థ టోటల్ 20 శాతం వాటా కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం దాదాపు రూ.18,200 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడితో అదానీకి చెందిన 2.35 గిగావాట్ల సౌర ఆస్తుల్లోనూ 50 శాతం వాటా టోటల్‌కు దక్కనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- గిల్.. ఎర్ర రుమాలు స్టోరీ ఏంటంటే?
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న గిల్.. ఈ మ్యాచులో ఓ ఎర్ర రంగు రుమాలుతో కనిపించాడు. అయితే ఇదే రంగు గల రుమాలును దాదాపు మూడేళ్ల నుంచి అతడు మ్యాచులు ఆడేటప్పుడు వినియోగిస్తున్నాడు. తాజాగా అందుకు గల కారణాన్ని చెప్పాడు గిల్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- పెళ్లికి ముందే బ్రేకప్.. కానీ!
అనుకోని కారణాల వల్ల పెళ్లికి ముందు తామిద్దరం బ్రేకప్ చెప్పుకున్నామని శివబాలాజీ దంపతులు తెలిపారు. ఆ బ్రేకప్ సంగతి కుటుంబసభ్యులకు తప్ప మరెవ్వరికి తెలియదని అన్నారు. దాని వెనుకున్న కారణమేంటో.. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి