తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్ న్యూస్​ @1PM - top ten news in Telangana today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news in Telangana today till now
తెలంగాణ టాప్​టెన్ న్యూస్

By

Published : Dec 28, 2020, 12:59 PM IST

1. అదే గుర్తొస్తుంది..

ఎంతకాలం జీవించామన్నది కాదు.. ఎలా జీవించామన్నదే ముఖ్యమని సురవరం ప్రతాపరెడ్డి నిరూపించారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్​లో సురవరం ప్రతాపరెడ్డి జయంతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

2. 2020లో నేరాలు తగ్గాయ్

రాచకొండ కమిషనరేట్​ పరిధిలోని నేరాల వార్షిక నివేదికను... సీపీ మహేశ్ భగవత్​ విడుదల చేశారు. గతేడాది కంటే 12 శాతం నేరాలు తగ్గినట్టు తెలిపారు. 51 శాతం మంది నిందితులకు శిక్షలు పడగా.. 82 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించినట్టు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

3. సీఎం కేసీఆర్ దత్తపుత్రిక వివాహం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం వైభవంగా జరుగుతోంది. కేసీఆర్ సతీమణితోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరై చరణ్-ప్రత్యూషలను ఆశీర్వదించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

4. సేదతీరాలంటే.. ఇవి ఉండాల్సిందే..!

రంగు రంగుల చేపలను చూస్తే.. ముచ్చటేస్తోంది. పక్షుల కిలకిలరావాలు వింటే.. మనస్సుకు ఎక్కడ లేని ప్రశాంతత కలుగుతుంది. కుందేళ్లు.. ఇతర జంతువులనూ చూసినా అంతే. కరోనా తరువాత.. వీటిని పెంచుకునేవారు ఎక్కువైయ్యారు. దీంతో... విక్రయదారులకు వ్యాపారం, ఆదాయం పెరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

5. ఇదే నా చివరి దీక్ష

రైతు సమస్యలను జనవరి నెలాఖరులోగా కేంద్రం పరిష్కరించకపోతే నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు సామాజిక కార్యకర్త అన్నా హజారే. అదే తన చివరి దీక్ష అవుతుందని స్పష్టం చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

6. 2025 నాటికి

భారత్​లోనే తొలి ​డ్రైవర్​ రహిత రైలు​ను.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో పాటు నేషనల్​ కామన్​ మొబిలిటీ కార్డు(ఎన్​సీఎంసీ)కు శ్రీకారం చుట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

7. అందుకే ఆయన ప్రత్యేకం!

లక్షల కోట్ల విలువైన కంపెనీకి వారసుడు. కానీ ఏ నాడు ఆ గర్వం ఆయనలో కనిపించదు. అతి పెద్ద కంపెనీకి గౌరవ ఛైర్మన్ హోదాలో ఉన్న.. ఓ సాధారణ ఉద్యోగిలానే వ్యవహరించడం ఆయనకే చెల్లుతుంది. కంపెనీ లాభాల్లో సింహ భాగాన్ని సేవలకే వినియోగిస్తూ దాతృత్వానికి అసలైన నిర్వచనం చెబుతున్న రతన్​ టాటా బర్త్​ డే సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

8. చైనా శాటిలైట్

రిమోట్​ సెన్సింగ్​ శాటిలైట్​ ప్రయోగం విజయవంతమైందని చైనా ప్రకటించింది. యోగాన్​-33తో పాటు.. మైక్రో, నానో సాంకేతిక పరిశోధనలకు ఉద్దేశించిన మరో ఉపగ్రహాన్ని సైతం అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

9. అసలైన నాయకుడు

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో రనౌట్​ అయిన తర్వాత రహానె చూపిన క్రీడాస్ఫూర్తిపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

10. చెన్నైకి రజనీ

హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన అగ్రకథానాయకుడు రజనీకాంత్‌ చెన్నైలోని తన నివాసానికి చేరుకున్నారు. సూపర్​స్టార్​కు ఆయన సతీమణి లత.. హారతి ఇచ్చి స్వాగతం పలికారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details