- తెలంగాణ @ 4,446
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతోంది. రికార్డుస్థాయిలో రోజువారీ కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో మరో 4వేల 446 కొవిడ్ కేసులు వెలుగు చూడగా... 12 మరణాలు సంభవించాయి. దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 33,514కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- భారత్ @ 2 లక్షల 34 వేలు
భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. కొత్తగా 2,34,692 మందికి వైరస్ సోకగా.. 1,341 మంది మరణించారు. లక్షా 23 వేల మందికిపైగా వైరస్ను జయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- అందరికీ టీకా అందేదెప్పుడు?
జనాభాలో ప్రతి అయిదుగురిలో ముగ్గురికి టీకా వేస్తే సామూహిక రోగ నిరోధక శక్తి (హెర్డ్ ఇమ్యూనిటీ) లభిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. భారతదేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి, వాడకాలను ఎన్నో రెట్లు పెంచితే కానీ, రెండో దశ కొవిడ్ విజృంభణకు పగ్గాలు వేయలేం. ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా టీకాలు వేగంగా అందుబాటులోకి రావడం లేదు. భారత్‌కు రోజుకు కోటి డోసుల కొవిడ్ వ్యాక్సిన్ కావలసి ఉండగా, అందులో సగం కూడా ఉత్పత్తి కావడం లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఉద్యమ స్థలాల్లో టీకా కేంద్రాలు
సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేస్తున్న ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) డిమాండ్ చేసింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా రైతులు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- భక్తులు పరిమితంగా ఉండాలి
కుంభమేళాలో పాల్గొనే భక్తుల సంఖ్య కొవిడ్ వ్యాప్తికి దారితీయకుండా లాంఛనప్రాయంగా ఉండాలని కోరారు ప్రధాని నరేంద్ర మోదీ. వైరస్ బారిన పడిన సాధువుల ఆరోగ్య పరిస్థితుల గురించి జునా అఖాడా ఆచార్యులు స్వామి అవదేశానందగిరిని ఫోన్లో అడిగి తెలుసుకున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- సీతారాముల కల్యాణానికి వేళాయె