తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9AM

ఇప్పటి వరకు ప్రధాన వార్తలు

top ten news
టాప్​టెన్​ న్యూస్​

By

Published : Feb 9, 2022, 9:00 AM IST

  • చడీ చప్పుడు లేకుండా గుట్టుగా పోస్టులు..

Teachers Transfers in Telangana: నిషేధం ఎత్తివేత ఉత్తర్వులు లేకుండానే.. మార్గదర్శకాలు ఇవ్వకుండానే గుట్టుగా పోస్టులు ఇవ్వడం వివాదాస్పదం అవుతోంది. ఇది నిబంధనలకు విరుద్ధమని, ప్రభుత్వంలోని పైస్థాయి అధికారులకు దగ్గరివారు, పైరవీలు చేసుకున్న వారికి పోస్టింగ్​లు ఇచ్చారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

  • భూ దందా వెనుక ఆ ముగ్గురి పాత్ర

Land Grabbing in Sangareddy : సర్కార్ భూములు కనిపిస్తే చాలు.. కబ్జాకు పాల్పడటం సర్వసాధారణమైంది ఆ ప్రాంతంలో. ఓఆర్​ఆర్​కు ఏడు మైళ్ల దూరంలో ఉన్న అసైన్డ్ భూములను కబ్జాదారులు ఆక్రమిస్తున్నారు. ఎవరైనా అడ్డుచెబితే ప్రాణాలు తీస్తామంటూ బెదిరిస్తున్నారు. కొందరు అధికారులు కూడా వారికి వత్తాసు పలకడం.. ఆక్రమణల్లో భాగస్వాములవుతుండటం వల్ల వాళ్లపై ఎన్ని ఫిర్యాదులు చేసినా బూడిదలో పోసిన పన్నీరే అవుతోంది.

  • 'నాలాల ప్రమాదాలకు అధికారులే బాధ్యులు'

Minister KTR on Nala Safety Audit : భవిష్యత్తులో నాలాలపై దురదృష్టకర ఘటనలు, ప్రమాదాలు జరిగితే ఉన్నతాధికారులనే ఇందుకు బాధ్యుల్ని చేస్తామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. జోనల్ కమిషనర్ మొదలు కింది స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ నాలాల వల్ల ప్రమాదాలు జరగకుండా సమగ్రమైన ప్రణాళికతో ముందుకెళ్లాలని ఆదేశించారు.

  • జేఎన్‌యూ వీసీ ప్రకటనపై వరుణ్‌ గాంధీ విమర్శలు

JNU VC News: దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) తొలి మహిళా వీసీగా డా.శాంతిశ్రీ ధూళిపూడి విడుదల చేసిన ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అందులో వ్యాకరణ దోషాలు దొర్లడమే ఇందుకు కారణం. దీంతో భాషా నైపుణ్యాల విషయంలో ఆమెపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.

  • 'కాంగ్రెస్ అంటే ప్రధానికి భయం.. '

PM Afraid of Congress: దేశంలో నిజాలను ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని చూస్తే ప్రధాని నరేంద్ర మోదీకి భయం పట్టుకుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అందుకే ఉభయ సభల్లో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని ప్రసంగమంతా కాంగ్రెస్ పార్టీ గురించే ఉంది తప్పా.. భాజపా వాగ్దానాల గురించి లేదని అన్నారు.

  • చిదంబరం దెబ్బకు.. దిగొచ్చిన బ్రిటిష్​ కంపెనీ

Azadi Ka Amrit Mahotsav: స్వదేశీ ఉత్పత్తులంటే అగ్గిపెట్టెలు, సబ్బుల తయారీగా సాగుతున్న వేళ... ఏకంగా ఓ స్టీమ్‌ నావిగేషన్‌ కంపెనీని ఏర్పాటు చేయటం మాటలు కాదు. అదీ బ్రిటిష్‌ కంపెనీకి పోటీగా! ఆ సాహసమే చేసిచూపి అటు ఆంగ్లేయులను దెబ్బతీసి... ఇటు భారతీయుల్లో ఆత్మనిర్భరతను పెంచారు వి.ఓ.చిదంబరం పిళ్లై. ఈ క్రమంలో జైలుపాలై తన సర్వస్వాన్నీ కోల్పోయారు.

  • బురదలో కూరుకుపోయి 14 మంది మృతి

Colombia Mudslide: పశ్చిమ కొలంబియాలో కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి చెందారు. 35 మంది గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

  • 2.8 శాతం తగ్గిన ఎయిర్‌టెల్‌ లాభం

Bharti Airtel Q3 results: మూడో త్రైమాసికంలో భారతీ ఎయిర్‌టెల్‌ ఏకీకృత నికర లాభం రూ.830 కోట్లకు చేరుకుంది. కానీ గతేడాది ఇదే క్వార్టర్​తో పోల్చితే 2.8 శాతం మేర నష్టం వచ్చినట్లు సంస్థ తెలిపింది.

  • కోహ్లీతో బ్యాటింగ్ చాలా ఈజీ

Devdutt padikkal kohli ipl: కోహ్లీతో బ్యాటింగ్ చేస్తే, తనపై బౌలర్లు పెద్దగా దృష్టిపెట్టరని అన్నాడు యువ బ్యాటర్​ దేవ్​దత్ పడిక్కల్. అతడితో ఆడటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు.

  • రామ్​చరణ్-శంకర్ సినిమా కథ.. ఆ స్టార్ డైరెక్టర్​ది

Ram charan karthik subbaraj: రామ్​చరణ్ కొత్త సినిమాలో స్టార్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ కూడా భాగమయ్యారు. తమిళంలో స్టార్ హీరోలతో చిత్రాలు చేస్తున్న ఈ దర్శకుడు.. చరణ్ సినిమాకు కథ అందించడం విశేషం.

ABOUT THE AUTHOR

...view details