తెలంగాణ

telangana

By

Published : May 21, 2021, 8:58 PM IST

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS@ 9PM
టాప్‌ టెన్ న్యూస్ @ 9 PM

  • ధైర్యం నింపిన సీఎం...

ఎంత ఖర్చైనాగానీ కొవిడ్‌ రోగులకు అవసరమైన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారుల్ని ఆదేశించారు. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన కరోనా రోగులకు మనోధైర్యం ఇచ్చారు. కొవిడ్‌ బాధితులు ఉన్న వార్డులకు వెళ్లి..... వారిని ఆప్యాయంగా పలకరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కొత్తగా 3,464 కరోనా కేసులు...

రాష్ట్రంలో కొత్తగా 3,464 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​తో తాజాగా 25 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మరో 4,826 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 45,757 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రఘురామకు బెయిల్ మంజూరు...

ఏపీలోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రఘురామ బెయిల్‌ పిటిషన్‌పై ఇరువైపులా పోటాపోటీగా వాదనలు సాగాయి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • త్వరగా తొలగించండి...

మహమ్మారి నుంచి బయట పడేందుకు టీకాలు వేయడమే మార్గమని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. టీకాల విషయంలో దేశానికి, ఫైజర్ సంస్థకు మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను వీలైనంత త్వరగా తొలగించాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్​కు కేటీఆర్​ ట్వీట్​ చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కృష్ణపట్నం చేరుకున్న ఐసీఎంఆర్ బృందం...

ఏపీ సీఎం జగన్ సూచనతో నెల్లూరు ఆయుర్వేద ఔషధం శాస్త్రీయ నిర్ధరణ కోసం ఐసీఎంఆర్ బృందం నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చేరుకున్నారు. ఆనందయ్య ... ఆయుర్వేద ఔషధం తయారు చేసే చెట్ల ఆకులు, పదార్థాలను పరిశీలించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బ్లాక్​ ఫంగస్ ఔషధ ఉత్పత్తికి...

బ్లాక్​ ఫంగస్​ చికిత్స కోసం వినియోగిస్తున్న ఆంఫోటెరిసిన్​- బి ఔషధం ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు.. కేంద్రం ముమ్మర చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆరు సంస్థలు.. ఈ ఔషధాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కోలుకుంటున్న గాజా...

ఇజ్రాయెల్​ సైన్యం, పాలస్తీనా గాజాలోని హమాస్​ ఉగ్రవాదుల మధ్య 11రోజుల పాటు జరిగిన ఘర్షణలకు తెరపడింది. ఇరువర్గాలు కాల్పుల విరమణ ఒప్పందానికి ఆమోదం తెలిపినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ట్విట్టర్​కు కేంద్రం వార్నింగ్!...

ట్విట్టర్​పై కేంద్రం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ టూల్‌కిట్‌గా చెబుతూ భాజపా నేతలు చేసిన ట్వీట్లను 'మ్యానిపులేటెడ్‌ మీడియా'గా పేర్కొనడంపై.. కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల పేర్కొన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కోహ్లీ కొత్త రికార్డ్​...

టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకోనున్నాడు. కొద్ది రోజుల్లో జరగబోయే టెస్ట్​ ఛాంపియన్​ షిప్​ మ్యాచ్​ ఆడితే.. 2008 నుంచి ఇప్పటి వరకు భారత్ ఆడిన అన్ని ఐసీసీ ఫైనల్స్​లోనూ పాల్గొన్న ఏకైక ఆటగాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఉగ్రవాది పాత్ర కోసం చాలా కష్టపడ్డా...

స్టార్​ హీరోయిన్​ సమంత నటించిన తొలి వెబ్​సిరీస్​ 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'. జూన్​ 4న అమెజాన్​ ప్రైమ్​ ద్వారా ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే ఇందులో సామ్​ ఓ ఉగ్రవాది పాత్రలో నటిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details