- కేంద్రం కొత్త మార్గదర్శకాలు..
మే1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం. మరిన్ని ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉచితంగా టీకా..
రాష్ట్రంలో అందరికీ కొవిడ్ టీకా ఉచితంగా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర సొంత జనాభాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి పనిచేస్తున్న వారందరికీ వయసుతో సంబంధం లేకుండా వ్యాక్సినేషన్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మరో రెండు కొత్త మండలాలు..
రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాలు ఆవిర్భవించాయి. మహబూబ్నగర్ జిల్లాలో మహమ్మదాబాద్, వికారాబాద్ జిల్లాలో చౌడాపూర్ పేరిట కొత్త మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు..
మినీ పురపోరు ఏర్పాట్లపై ఎస్‌ఈసీ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు, ప్రజారోగ్య సంచాలకులు, ఎన్నికల పరిశీలకులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణపై పలు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఓరుగల్లు భాజపాదే..
ఓరుగల్లులో అన్ని సర్వేలు భాజపాకు అనుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. కమలం పార్టీ పూర్తి మెజార్టీతో గెలబోతోందన్నారు. ఓరుగల్లులో 40 సీట్లకు పైగా గెలవబోతున్నామని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఏపీలో కరోనా ఉద్ధృతి..