తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @9PM
TOP TEN NEWS @9PM

By

Published : Apr 9, 2021, 8:59 PM IST

Updated : Apr 9, 2021, 9:06 PM IST

  • జోరుగా షర్మిల సంకల్ప సభ..

ఖమ్మంలో వైఎస్​ షర్మిల తలపెట్టిన సంకల్ప సభ జోరుగా సాగుతోంది. వైకాపా కార్యకర్తలు, వైఎస్​ అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. సభా ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందికి సాయం..

ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందికి ఏప్రిల్ నుంచి రూ.2వేల ఆర్థిక సాయంతో పాటు బియ్యం అందించనున్నట్లు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్ వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలల్లో సుమారు లక్షా 45 వేల మంది పనిచేస్తున్నారని తెలిపారు. ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్లు, అధికారులను మంత్రులు ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఒక్కరోజే లక్ష పరీక్షలు, టీకాలు..

రాష్ట్రంలో 1100కు పైగా కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్​ కొనసాగుతుందని.. ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్​ శ్రీనివాసరావు వెల్లడించారు. గురువారం ఒక్కరోజే లక్ష కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామన్న ఆయన.. లక్షకుపైగా టీకాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • వరంగల్​కు కేటీఆర్..

ఈనెల 12న వరంగల్​లో పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. పర్యటించనున్నారు. కేటీఆర్ పర్యటనపై, నగరాభివృద్ధి పనులపై మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఇతర ప్రజాప్రతినిధులు ఆర్ అండ్ బీ అతిథి గృహంలో సమీక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆంధ్రప్రదేశ్​ అభ్యంతరం..

ఇవాళ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశమైంది. దిల్లీ నుంచి వర్చువల్ విధానంలో నిర్వహించిన కమిటీ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నాలుగో దశకు సర్వం సిద్ధం..

బంగాల్ శాసనసభ ఎన్నికల 4వ విడత పోలింగ్​కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం 44 నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది. 373 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కొవిడ్​ అనంతరం కొత్త ఉపాధి అవకాశాలు..

భారత్​, నెదర్లాండ్​ లాంటి ప్రజాస్వామ్య దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగైతే ఇరు దేశాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత్​-యూరోపియ్​ యూనియన్​ సమ్మిట్​లో ఇరుదేశాలకు సంబంధించి కొత్త అవకాశాల గురించి చర్చిద్దామని నెదర్లాండ్​ ప్రధాన మంత్రి మార్క్​ ర్యూట్​తో వర్చువల్ సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ప్రిన్స్ ఫిలిప్ కన్నుమూత..

బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్‌ ఫిలిప్ (99)‌ కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. కోలుకుని ప్యాలెస్‌కు చేరుకున్నారు. అక్కడ మళ్లీ తీవ్ర అనారోగ్యానికి గురికావడం వల్ల ఈరోజు (శుక్రవారం) మృతి చెందారు. ఈ మేరకు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ వర్గాలు ప్రకటించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అత్యధిక వికెట్లు పడగొట్టిన వీరులు!

టీ20 ఫార్మాట్ అంటే బ్యాట్స్​మెన్​కు పండగే. కానీ కొందరు బౌలర్లూ వారి ప్రతిభతో జట్టుకు విజయాలనందించారు. ఐపీఎల్ అందుకు మినహాయింపు కాదు. చాలా సందర్భాల్లో బౌలర్లు బ్యాట్స్​మెన్​పై ఆధిపత్యం వహించిన నేపథ్యాలు ఉన్నాయి. మరికొద్ది గంటల్లో ఐపీఎల్​ ప్రారంభకానున్న నేపథ్యంలో లీగ్​లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లు ఎవరో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'దెయ్యం'తో మళ్లీ వస్తున్న ఆర్జీవీ..

రామ్​గోపాల్ వర్మ-రాజశేఖర్​ కాంబోలో తెరకెక్కిన 'దెయ్యం' చిత్రం.. ఈ నెల 16న థియేటర్లలోకి రానుంది. శుక్రవారం వచ్చిన ట్రైలర్​, ఆద్యంతం ఆసక్తిని పెంచుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

Last Updated : Apr 9, 2021, 9:06 PM IST

ABOUT THE AUTHOR

...view details