మంచి రోజులొచ్చాయ్...
వ్యవసాయ బిల్లుల ఆమోదంతో రైతులకు మంచి రోజులు రాబోతున్నాయన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారతదేశ వ్యవసాయ రంగంలో ఇదో చారిత్రక సందర్భంగా అభివర్ణించారు. రైతుల ఆదాయం రెట్టింపునకు ఈ బిల్లులు ఉపకరిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర, పంట ఉత్పత్తి సేకరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
హరివంశ్‌పై అవిశ్వాసం...
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్‌పై 12 విపక్ష పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టాయి. వ్యవసాయ బిల్లులపై చర్చ సందర్భంగా రూల్ బుక్కు వ్యతిరేకంగా కొన్ని అంశాలు ఉన్నట్లు విపక్ష పార్టీలు అభ్యంతరం తెలిపాయి. అయినా వాటన్నింటిని బేఖాతరు చేస్తూ చర్చ కొనసాగించారని.. హరివంశ్ వ్యవహారశైలిని తప్పుబట్టాయి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఎప్పుడూ ఇలా జరగలేదు...
రాజ్యసభలో వ్యవసాయ బిల్లల ఆమోదం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని తెరాస ఎంపీలు ఆరోపించారు. కేంద్రానికి డిప్యూటీ ఛైర్మన్ పూర్తి పక్షపాతంగా వ్యవహరించటాన్ని ఖండించిన ఎంపీలు... అవిశ్వాస తీర్మానం పెట్టినా సభ అధ్యక్షుడి హోదాలో ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
భయం... భయం...
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కడంబా అటవీప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టుల్లో ఒకరిని పోలీసులు గుర్తించారు. మరొక మావోయిస్టు వివరాల కోసం ఆరాతీస్తున్నారు. మరోపక్క తప్పించుకున్న మావోయిస్టు కీలక నేత మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ కోసం ముమ్మర కూంబింగ్ జరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
చాలా రోజుల తర్వాత...
యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కరోనా కాలంలో చాలా రోజుల తర్వాత ఆలయంలో సందడి నెలకొంది. మరో వైపు భక్తులు పలుచోట్లు భౌతిక దూరం పాటించడం లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.