- పరీక్షల రద్దు యోచనలో ప్రభుత్వం..
కరోనా నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రద్దయ్యే అవకాశం ఉంది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఇంటర్‌బోర్డు, ఎస్సెస్సీ అధికారులతో విద్యాశాఖ ప్రత్యేక సీఎస్ సమావేశమయ్యారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై అధికారులు చర్చిస్తున్నారు. దీనిపై మరికాసేపట్లో స్పష్టత రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి..
నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారం ముగిసింది. ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సీఈవో శశాంక్ గోయల్ తెలిపారు. 17న ఓటర్లు అందరూ తరలొచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రెమిడెసివిర్ ఇంజక్షన్ ప్రభావమెంత..?
రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మందుల వినియోగం అదే స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల కొవిడ్ రోగులకు అందించే రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత ఏర్పడింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రుణయాప్‌లపై హైకోర్టుకు డీజీపీ నివేదిక..
ఆన్లైన్ రుణయాప్‌లపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. వాటిపై తీసుకున్న చర్యలపై ఉన్నత న్యాయస్థానానికి డీజీపీ మహేందర్ రెడ్డి నివేదిక సమర్పించారు. 290 రుణయాప్‌లను గుర్తించి నిలిపివేసినట్లు డీజీపీ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రజలను కాపాడుకోవడమే భాజపా ధ్యేయం..
ప్రజలను కాపాడుకోవడమే తమ ప్రధాన ధ్యేయమని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తమ పార్టీకి కావాల్సింది ఓట్లు, సీట్లు, నోట్లు కాదన్నారు. సాగర్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా హాలియాలో రోడ్‌షో అనంతరం ఆయన మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టీకా ఉత్పత్తి పెంచాలి..