తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్ @7PM - టాప్​టెన్​ న్యూస్​ @ 7pm

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top 7
టాప్​టెన్​ న్యూస్ @ 7PM

By

Published : Feb 5, 2021, 6:56 PM IST

7న సమావేశం..

పార్టీ శ్రేణుల్లో పునరుత్తేజం, ప్లీనరీ సమావేశాల అజెండా, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, సంస్థాగత పునర్నిర్మాణంపై తెరాస దృష్టి సారించింది. ఫిబ్రవరి 7వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్​లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సీఎం సమీక్ష..

నాగార్జునసాగర్​ ఉపఎన్నికపై నల్గొండ జిల్లా తెరాస నేతలతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని దిశానిర్ధేశం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

యథాతథం..

ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ యథాతథంగా కొనసాగుతుందని విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అధ్యయన కమిటీ..

ప్రాజెక్టుల్లో ఉన్న నీటినిల్వల ఆధారంగా మార్చి ఆఖరు వరకు అవసరాలకు అనుగుణంగా నీటి కేటాయింపులపై కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ భేటీలో చర్చించారు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నీటి వృథాను అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రత్యేకమైన బడ్జెట్..

దేశ ఆర్థిక వ్యవస్థలోనే ఇది ప్రత్యేకమైన బడ్జెట్ అని కేంద్ర మాజీ మంత్రి సురేశ్ ప్రభు అభిప్రాయపడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి కచ్చితంగా సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తొలి మెగా ఈవెంట్​ ఇదే

ఎన్నో కఠిన పరిస్థితులు ఉన్నప్పటికీ.. ఏరో ఇండియా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. బెంగళూరులో జరుగుతున్నఈ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సోమవారానికి వాయిదా..

వ్యవసాయ చట్టాల రద్దుకు పట్టుబడుతూ విపక్షాలు చేసిన ఆందోళనలతో లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కాగానే సాగు చట్టాలను రద్దు చేయాలంటూ ప్రతిపక్ష నేతలు నినాదాలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బుల్​ జోరు..

స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 117 పాయింట్లు పెరిగి జీవనకాల గరిష్ఠమైన 50,700 పైకి చేరింది. నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 14 వేల 900 మార్క్ దాటింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

100@100

టీమ్​ఇండియాతో జరుగుతోన్న తొలి టెస్టులో రూట్​ మరో రికార్డు సాధించాడు. 100వ టెస్టులో సెంచరీ బాదిన తొమ్మిదో క్రికెటర్​గా ఘనత సాధించాడు. సుధీర్ఘ ఫార్మాట్​లో ఇది అతడికి 20వ శతకం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ముందే వస్తున్న 'కపటధారి'

మలయాళ సూపర్​స్టార్ మమ్ముట్టి 'దృశ్యం 2' అమెజాన్ ప్రైమ్​లో నేరుగా విడుదల కానుంది. సుమంత్ 'కపటధారి' చెప్పిన తేదీ కంటే ముందే థియేటర్లలో సందడి చేయనుంది. మరిన్ని సినిమా విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details