1. మరోమారు చర్చలు..
ఈ నెల 30న చర్చలకు రావాలని రైతు సంఘాలకు కేంద్రం లేఖ రాసింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు దిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో సమావేశానికి హాజరు కావాలని కోరింది. 40 రైతు సంఘాలకు ఈ మేరకు ఆహ్వానం పంపింది. సాగు చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేలా విశాల దృక్పథంతో సానుకూల చర్చలు జరిపేందుకు సిద్ధమని లేఖలో పేర్కొంది కేంద్రం.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. గౌరవించకపోతే పతనమే..
వ్యవసాయాన్ని గౌరవించని దేశం పతనమైపోతుందని వ్యాఖ్యానించారు ఎంఎన్ఎం అధినేత కమల్ హాసన్. భారత్‌లో అలా జరగదని నమ్ముతున్నానని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. సీఎం కేసీఆర్ సమీక్ష..
నీటిపారుదలశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సమీక్షించారు. జలవనరుల శాఖ స్వరూపాన్ని సీఎం ఖరారు చేశారు. నీటిపారుదల రంగంలో వచ్చిన మార్పులకనుగుణంగా జలవనరుల శాఖ పునర్వ్యవస్థీకరణ చేసినట్టు కేసీఆర్ పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ప్రజలను మోసం చేస్తున్నాయి..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తూ.. అవినీతికి పాల్పడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల కోసం పని చేస్తుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. అది ఓ రబ్బర్ స్టాంప్..
ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ... నిరుద్యోగ ఐకాస ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.