తెలంగాణ

telangana

By

Published : May 25, 2021, 5:01 PM IST

ETV Bharat / city

టాప్‌టెన్ న్యూస్ @ 5 PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS@ 5 PM
టాప్‌టెన్ న్యూస్ @ 5 PM

  • అదుపులోకి వచ్చిన మంటలు...

విశాఖ హెచ్‌పీసీఎల్‌లో దట్టమైన పొగలతో మంటలు చెలరేగాయి. సుమారు గంట పాటు శ్రమించిన తరువాత మంటలు అదుపులోకి వచ్చాయి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పురోగతిపై ఆరా...

నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీశ్​ రెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఇంజనీర్లతో ప్రగతిభవన్​లో సీఎం సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అడిగితే పోలీసులపైనే దాడి...

హైదరాబాద్‌ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమాద్ నగర్ బస్తీలో ఇద్దరు యువకులు హల్‌చల్ చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి మాస్క్‌ లేకుండా రోడ్డుపైకి వచ్చిన యువకుడి వాహనాన్ని ఆపడంతో.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వర్ష సూచన...

రాగల 12 గంటల్లో యాస్ తుపాను అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు. ఇది చాంద్‌బలి-ధర్మా పోర్టులకు దగ్గరగా ఈనెల 26 తెల్లవారుజామున చేరుకుంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పని ప్రదేశాల్లో టీకాలు...

ప్రైవేట్ సంస్థల్లో కరోనా వ్యాక్సినేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తమ సిబ్బందికి టీకాలు ఇచ్చేందుకు వెసులుబాటు కల్పించింది. పని ప్రదేశాల్లో టీకాలు వేసేందుకు ఆయా సంస్థలకు సర్కారు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రోగులపై దయలేక...

రామ నగర్​ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. కొవిడ్​ కేర్ సెంటర్​లో ఉన్న వ్యాధిగ్రస్థులను ఇరుగుపొరుగువారు రాళ్లతో కొట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఒంటరి పురుషుల్లో ముప్పు అధికం!...

ఒంటరితనం అనుభవించే పురుషుల్లో క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉందని ఓ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. సుమారు 40 ఏళ్ల పాటు ఈ అధ్యయనం జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఫేస్​బుక్ కసరత్తు...

నూతన ఐటీ నిబంధనలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఫేస్​బుక్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి కసరత్తు జరుగుతున్నట్లు వివరించింది. మే 26 నుంచి నూతన ఐటీ నిబంధనలు అమలులోకి రానున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ద్రవిడ్​ను చూస్తే భయపడేవాళ్లం...

క్రికెట్​ దిగ్గజం రాహుల్ ద్రవిడ్​ తమతో ఎంత సన్నిహితంగా ఉన్నా.. ఆయన్ను చూస్తే కొంచెం భయంగా ఉండేదని వెల్లడించాడు టీమ్ఇండియా యువ ఓపెనర్​ పృథ్వీ షా. ఆటగాడి సహజ శైలిలో ఆడటానికి ద్రవిడ్ మద్దతిచ్చేవారని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • స్పందించిన సినీనటుడు చంద్రమోహన్​...

తన ఆరోగ్యంపై వస్తోన్న వదంతులపై సినీనటుడు చంద్రమోహన్​ స్పందించారు. తాను అనారోగ్యానికి గురయ్యానంటూ ప్రచారం జరుగుతున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details