'పోటీలో ఎవరుంటే ఏంటి.. ?'
హుజూరాబాద్‌లో పోటీపై ఈటల రాజేందర్ సతీమణి జమున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోటీలో తానున్నా.. రాజేందర్ ఉన్నా ఒకటేనని పేర్కొన్నారు. ఎవరు పోటీ చేయాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ఆమె.. ఎవరికి అవకాశం వస్తే వారు బరిలో ఉండాలని యోచిస్తున్నట్లు చెప్పారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
' చుక్క కూడా వదలం '
తెలంగాణపై కుట్ర చేయాలనే ఉద్దేశంతోనే.. నదీ జలాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గెడిట్ విడుదల చేసిందని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి వచ్చే ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోమని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఒకప్పుడు అధ్యాపకులు.. కానీ ఇప్పడు ..!
పుస్తకాలు పట్టి పాఠాలు చెప్పిన సార్లు.. ఇప్పుడు పారలు పట్టి మట్టి పనికి పోతున్నారు. ఎంతో మంది యువత ఉపాధి పొందేందుకు దారి చూపిన అధ్యాపకులు.. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
గ్రూపుగా వెళ్తారు... సేవ చేసి వస్తారు!
గ్రూపు అనగానే మనకి ఏ వాట్సాప్ గ్రూపో ఫేస్‌బుక్ గ్రూపో గుర్తొస్తుంది. కానీ, ఇవి కేవలం వర్చువల్ గ్రూపులు కావు... వాస్తవ ప్రపంచానికి దగ్గరగా పనిచేసే గ్రూపులు. పరుల సాయం కోసం విభిన్నంగా పాటుపడుతున్న బృందాలు. మీరే చూడండి... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
' చర్చకు సిద్ధమే'
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో అఖిలపక్షం సమావేశమైంది. పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలు సజావుగా జరిగేలా సహకరించాలని ఈ భేటీలో విపక్షాలను కోరింది కేంద్రం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ముంబయిని ముంచెత్తిన వరదలు
మహారాష్ట్ర ముంబయి నగరంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
స్టేడియం వద్ద షూటౌట్.!
బేస్‌బాల్ స్టేడియం వెలుపల దండుగలు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. అమెరికా వాషింగ్టన్లో జరిగిందీ ఘటన. పోర్ట్‌ల్యాండ్, ఓరెగానాలో జరిగిన మరో కాల్పుల ఘటనలో.. ఇద్దరు వ్యక్తులు మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
షేరు.. మాకెందుకు రాలేదు?
ఐపీఓ.. ఇటీవల అంకుర సంస్థలు ఇందుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నాయి. జొమాటో ఐపీఓ ఇటీవలే ముగిసింది. పేటీఎం కూడా త్వరలో ఐపీఓకు రానుంది. అనేక చిన్న చిన్న సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
లంక బ్యాటింగ్
తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది శ్రీలంక. ఈ మ్యాచ్‌తో టీమ్ఇండియా క్రికెటర్స్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ వన్డేలో అరంగేట్రం చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
పబ్లిక్‌గా ముద్దుపెట్టిన హీరోయిన్!
రూమర్ బాయ్‌ఫ్రెండ్ శాంతనుకు పబ్లిక్‌గా ముద్దుపెట్టింది శ్రుతిహాసన్! ఆ ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఇంతకీ ఏం జరిగింది? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.