రాష్ట్ర కేబినెట్ భేటీ
ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయింది. జోనల్ విధానంలో మార్పులు, చేర్పులకు ఆమోదం లభించిన నేపథ్యంలో ఖాళీల భర్తీకి కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. భూములు, రిజిస్ట్రేషన్ల ధరల పెంపు, పలు అంశాలపై మంత్రి వర్గంలో చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
' వాటిపై ఓ కన్నేసి ఉంచాలి'
కరోనా కట్టడికి క్షేత్ర స్థాయిలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా మూడో దశ రాకుండా ఉండాలంటే వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పేర్కొన్నారు. కొవిడ్ పరిస్థితిపై ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో ఆయన సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కాంగ్రెస్ గూటికి కీలక నేతలు..!
హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని.. ధర్మపురి సంజయ్, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, గండ్ర సత్యనారాయణ రావు కలిశారు. రేవంత్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. తాము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే దిల్లీలో అధిష్ఠానం సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అందువల్లే అంతర్జాతీయ పెట్టుబడులు
పెట్టుబడుల ఆకర్షణకు ఇతర రాష్ట్రాలతో పోటీపడుతున్నామని మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. సింగపూర్ పెట్టుబడుల కోసం ప్రత్యేక హబ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సాక్ష్యాలుంటే ఇవ్వండి..!
ఏపీ మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సాక్ష్యాలుంటే సీబీఐకి ఇవ్వాలని... ఆయన కుమార్తె సునీత, కేంద్ర గ్రీవెన్స్ సెల్‌కు కడప న్యాయవాది సుబ్బారాయుడు లేఖ రాశారు. ఈ లేఖపై ఆమె పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు వివేకా హత్యకేసులో 37వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. నేడు ఐదుగురు అనుమానితులను సీబీఐ ప్రశ్నిస్తోంది.