నిబంధనల మధ్యే దర్శనం
భాగ్యనగరంలో బోనాల(Bonalu Festival) సందడి అంబరాన్నంటుతోంది. మొదటి రోజే అమ్మవారికి బోనం సమర్పించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. గోల్కొండ జగదాంబ అమ్మవారికి.. ఆ ఆలయ కమిటీ బంగారు బోనాన్ని సమర్పించింది. ఈ ఉత్సవాల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డిలు పాల్గొన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రాష్ట్రంలో జోరు వానలు
రాష్ట్రంలో జోరు వానలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కురిసిన తొలకరి జల్లులతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో మరో మూడు రోజుల పాటు మోస్తరు వాన కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా 3000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 15 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఉదయభానును అడ్డుకున్న పోలీసులు
పులిచింతల ప్రాజెక్టు వద్దకు వెళుతున్న ఏపీ ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభానును తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో ఉదయభాను చర్చిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'వారిని నామినేట్ చేయండి'
అసాధారణ పనితీరు కనబరుస్తూ, ఎవరికీ తెలియకుండా సాధారణంగా ఉండేవారిని పద్మ అవార్డులకు నామినేట్ చేయాలని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
' ప్రపంచంలోనే అతిపెద్ద సైకత శిల్పం'
కేక్ స్టాండ్స్, జాక్‌ఫ్రూట్, నారింజా, బిస్కెట్ల వంటి వాటిపై చిత్రాలను గీస్తూ.. తన సూక్షకళతో అబ్బురపరుస్తున్నారు ఒడిశాకు చెందిన ప్రియాంక సాహ్నీ. సోమవారం.. పూరీ జగన్నాథుడి రథయాత్ర నేపథ్యంలో 108 చిత్రాలను గీశారు. మరోవైపు ప్రపంచంలోనే అతి పెద్ద సైకత శిల్పాన్ని నిర్మించారు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.